Mallikarjun Kharge : 47 మందితో సీడబ్ల్యూసీ స్టీరింగ్ కమిటీ
సంచలన నిర్ణయం తీసుకున్న ఖర్గే
Mallikarjun Kharge : ఏఐసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనదైన ముద్ర కనబర్చేలా స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో కీలకమైన నాయకులకు 47 మందితో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు ఉన్న టీంలో వారంతా తప్పుకున్నారు.
వారి స్థానంలో కొత్త వారికి చోటు కల్పించారు. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి సుబ్బరామిరెడ్డికి ఈ కమిటీలో చోటు దక్కింది. 24 ఏళ్ల తర్వాత గాంధీయేతర వ్యక్తి కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా ఎన్నికయ్యారు. ఖర్గే అత్యంత సాధారణ కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తండ్రి స్వయాన కూలీ. 27 ఏళ్ల వయసు లోనే రాజకీయాల్లోకి వచ్చారు.
1972లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. కర్ణాటక కాంగ్రెస్ రాజకీయ చరిత్రలో 10 సార్లు అసెంబ్లీకి ఎన్నికై రికార్డు సృష్టించారు. 2009 నుంచి 2019 వరకూ లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు. పార్టీ అధ్యక్ష పదవికి ముందు సీఎం అశోక్ గెహ్లాట్, కమల్ నాథ్, దిగ్విజయ్ సింగ్ పేర్లు వచ్చినా చివరకు సోనియా గాంధీ ఖర్గేకు అవకాశం ఇచ్చింది.
ఆయనకు పోటీగా తిరువనంతపురం ఎంపీ శశి థరూర్(Shashi Tharoor) నిలిచారు. 6 వేలకు పైగా ఓట్ల తేడాతో మల్లికార్జున్ ఖర్గే గెలుపొందారు. బరిలో నిలిచే కంటే ముందు రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ పక్ష నాయకుడిగా ఉన్నారు. తన పదవికి రాజీనామా చేసి పోటీలో నిలిచి సత్తా చాటాడు. ఈ సందర్భంగా తనపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికీ ఖర్గే ధన్యవాదాలు తెలిపారు.
Also Read : మక్తల్ నుంచి రాహుల్ పాదయాత్ర