Mallikarjun Kharge : రాజీవ్ గాంధీ ఎల్లప్పటికీ స్పూర్తి – ఖర్గే
ఆయన జీవితం ఆదర్శ ప్రాయం
Mallikarjun Kharge : దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ ఎల్లప్పటికీ స్పూర్తిగా నిలుస్తారని పేర్కొన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన సద్భావన అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమానికి ఖర్గే ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ పురస్కారం అత్యంత ముఖ్యమైదని పేర్కొన్నారు.
Mallikarjun Kharge Paid Tribute to Rajiv Gandhi
ఈ సందర్బంగా బనస్థలి విశ్వ విద్యాలయం ఈ అవార్డుకు ఎంపికైందని తాను అభినందిస్తున్నానని తెలిపారు ఏఐసీసీ చీఫ్(Mallikarjun Kharge). ప్రతి ఒక్కరూ విశ్వ విద్యాలయం గురించి వాకబు చేస్తున్నారని పేర్కొన్నారు ఖర్గే.
ఈ రోజుల్లో చాలా మంది రాజీవ్ గాంధీ సాధించిన విజయాలను విస్మరించేందుకు ప్రయత్నం చేస్తున్నారని కానీ వారిని చరిత్ర క్షమించదన్నారు. తాజాగా కేంద్రంలో కొలువు తీరిన మోదీ సర్కార్ నెహ్రూ మెమోరియల్ పేరును తీసి వేస్తున్నట్లు ప్రకటించింది.
దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. కానీ ఎల్లప్పుడూ బుద్ద భగవానుడు మూడు విషయాలు చెప్పేవాడు. ఒకటి సూర్యుడు, రెండు చంద్రుడు మూడు సత్యాన్ని దాచలేమని, అదే విధంగా రాజీవ్ గాంధీ విజయాలను కూడా దాచలేమన్నారు.
Also Read : Arvind Kejriwal : ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి – కేజ్రీవాల్