Mallikarjun Kharge : ప్రమాదంలో ప్రజాస్వామ్యం – ఖర్గే
కేంద్ర సర్కార్ ది రాచరిక పాలన
Mallikarjun Kharge : ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నిప్పులు చెరిగారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాము ప్రజాస్వామ్య పద్దతుల్లో శాంతియుతంగా నిరసన తెలియ చేస్తున్నామని చెప్పారు. భావ సారూప్యత కలిగిన పార్టీలు, సంస్థలు తమకు మద్దతుగా నిలుస్తున్నాయని తెలిపారు. కానీ ప్రజాస్వామ్యం పట్ల ఏమాత్రం ప్రధానమంత్రికి గౌరవం లేకుండా పోయిందని ఆరోపించారు.
నిరసన తెలపడం, ప్రశ్నించడం, నిలదీయడం భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని గుర్తు చేశారు. కానీ ప్రధానమంత్రి తాను మాత్రమే లీడర్ నని, మిగతా వాళ్లు కారన్న భ్రమల్లో ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. దేశంలో రోజు రోజుకు అనార్కిజం ప్రబలుతోందని, కేవలం వ్యక్తి వాదం చుట్టూ తిరుగుతోందంటూ మండిపడ్డారు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge).
ప్రభుత్వం దిగి వచ్చేంత దాకా తాము ఆందోళన చేపడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ కేవలం కొద్ది మందికే ప్రయారిటీ ఇస్తూ వస్తున్న నరేంద్ర మోదీని ప్రజలు రాబోయే రోజుల్లో క్షమించరని పేర్కొన్నారు. కేవలం బీజేపీ మాత్రం ఉండాలని కోరుకోవడం ప్రజాస్వామ్యం కాదన్నారు.
వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ పోతే చివరకు దేశానికి ఏం మిగిలించాలని అనుకుంటున్నారంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశ్నించారు.
Also Read : కాంగ్రెస్ హయాంలోనే అదానీకి పెద్దపీట