Mallikarjun Kharge : సుప్రీంకోర్టు తీర్పుకు థ్యాంక్స్
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే
Mallikarjun Kharge : ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యం ఇంకా బతికే ఉందని తేలి పోయిందన్నారు. మోదీ కుట్రలు సాగవన్నారు ఖర్గే(Mallikarjun Kharge). మోదీ పరువు నష్టం కేసులో గుజరాత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు కీలక కామెంట్స్ చేసింది. ఈ మేరకు స్టే ఇచ్చింది. దీంతో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సంబురాలలో మునిగి పోయింది.
Mallikarjun Kharge Said
2019లో ఎన్నికల సమయంలో కర్ణాటకలో జరిగిన సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కీలక వ్యాఖ్యలు చేశారంటూ గుజరాత్ లోని సూరత్ లో పరువు నష్టం దావా దాఖలైంది. దీనిపై సూరత్ సంచలన తీర్పు వెలువరించింది. ఈ మేరకు రాహుల్ గాంధీకి 2 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.
ఈ తీర్పును సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కింది కోర్టు సూరత్ ఇచ్చిన తీర్పు సరైనదేనని పేర్కొంటూ శిక్ష వేయాల్సిందేనంటూ తీర్పు చెప్పింది గుజరాత్ కోర్టు. ఆయన పిటిషన్ ను కొట్టి వేసింది. అయితే తాము ఇచ్చిన తీర్పును సవాల్ చేసేందుకు సుప్రీంకోర్టుకు వెళ్ల వచ్చని తెలిపింది.
దీంతో రాహుల్ భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. ఇవాళ విచారణ చేపట్టిన కోర్టు స్టే విధించింది. ఈ తీర్పు సరైనది కాదని పేర్కొంది.
Also Read : Nara Lokesh : పెద్దిరెడ్డీ పాపం పండుతుంది – లోకేష్