Mallikarjun Kharge : బొమ్మై పాల‌న‌పై భ‌గ్గుమ‌న్న ఖ‌ర్గే

అవినీతికి అంద‌లం ప్ర‌జ‌ల‌కు శాపం

Mallikarjun Kharge : ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే నిప్పులు చెరిగారు. ఆయ‌న క‌ర్ణాట‌క‌లో కొలువు తీరిన భార‌తీయ జ‌న‌తా పార్టీ బొమ్మై స‌ర్కార్ ను ఏకి పారేశారు. ప్ర‌స్తుత ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల పాలిట శాపంగా మారింద‌న్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా హుబాలి ధార్వాడ్ వెస్ట్ లో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే(Mallikarjun Kharge) ప్ర‌సంగించారు. 40 శాతం క‌మీష‌న్ నిర్ణ‌యించార‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు 75 ఏళ్ల స్వ‌తంత్ర భార‌తంలో ఎన్న‌డూ చూడ లేద‌ని ఎద్దేవా చేశారు ఏఐసీసీ చీఫ్‌.

అక్ర‌మ ప‌ద్ద‌తుల్లో అంద‌లం ఎక్కిన భారతీయ జ‌న‌తా పార్టీ ప్ర‌జ‌ల ఆశ‌ల‌పై నీళ్లు చల్లింద‌ని ఆరోపించారు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే. ఆరున్న‌ర కోట్ల క‌న్న‌డిగుల న‌మ్మ‌కాన్ని కోల్పోయింద‌ని అన్నారు. ప్ర‌జ‌ల విశ్వాసాన్ని కోల్పోయింద‌ని చెప్పారు. ప్ర‌తి ప‌నికి ఓ రేటు నిర్ణ‌యించ‌డం దారుణ‌మ‌న్నారు. బొమ్మై అవినీతి పాల‌న‌తో ప్ర‌జ‌లు విసుగు చెందార‌ని, వారంతా మార్పు కోరుకుంటున్నార‌ని స్ప‌ష్టం చేశారు ఏఐసీసీ చీఫ్‌.

వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసి బ‌డా వ్యాపార‌వేత్త‌ల‌కు అప్ప‌గిస్తున్న ఘ‌న‌త ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకే ద‌క్కుతుంద‌ని అన్నారు. త్వ‌ర‌లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీకి ఓట‌మి ఖాయ‌మ‌న్నారు. ఇక వ‌చ్చేది త‌మ ప్ర‌భుత్వ‌మేన‌ని జోష్యం చెప్పారు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే(Mallikarjun Kharge). ప్ర‌జా పాల‌న అందించ‌డం ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్య‌మ‌వుతుంద‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం అవినీతికి అంద‌లం

Leave A Reply

Your Email Id will not be published!