Mallikarjun Kharge : మతం పేరుతో హింస తగదు – ఖర్గే
కాల్పులకు తెగబడటం పద్దతి కాదు
Mallikarjun Kharge : ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. హర్యానాతో పాటు మణిపూర్ , తదితర ప్రాంతాలలో చోటు చేసుకుంటున్న ఘటనలు బాధా కరమని పేర్కొన్నారు ఖర్గే. ఇది ఎంత మాత్రం దేశానికి మంచిది కాదన్నారు. అయితే మతం పేరుతో హింసోన్మాదానికి పాల్పడడాన్ని తాము ఒప్పుకునే ప్రసక్తి లేదన్నారు.
Mallikarjun Kharge Comments
శాంతి భద్రతలను కాపాడడంలో కేంద్రం విఫలమైందన్నారు. తాజాగా ముంబై – జైపూర్ ట్రైన్ లో ఆర్పీఎఫ్ జవన్ చేతన్ సింగ్ కాల్పులకు తెగబడ్డాడు. మాట మాటా పెరిగి కాల్పులకు దిగడం విస్తు పోయేలా చేసింది. ఇది దేశ వ్యాప్తంగా చర్చనీయాంగా మారింది.
కులం పేరుతో, మతం పేరుతో, జాతుల పేరుతో జరుగుతున్న వరుస ఘటనలు తనను ఎంతగానో బాధకు గురి చేశాయని పేర్కొన్నారు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge). చాలా చోట్ల ఇలాంటివి చోటు చేసుకోవడం రాబోయే భవిష్యత్తుకు మరింత ఇబ్బంది కలిగిస్తాయని వాపోయారు.
వ్యవస్థలు ఎప్పుడైతే నిర్వీర్యంగా మారుతాయో ఇలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటాయని ముందే పసిగట్టి చర్యలు తీసుకుంటే ఇంతటి ఘోరాలు చోటు చేసుకోవంటూ అభిప్రాయపడ్డారు ఏఐసీసీ చీఫ్. మొత్తంగా ఖర్గే చేసిన కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Also Read : Thota Chandrasekhar : నవ రత్నాల పేరుతో నయవంచన