Mallikarjun Kharge : స‌రిహ‌ద్దు వివాదం రాజ్య‌స‌భ‌లో రాద్దాంతం

ఏఐసీసీ చీఫ్‌ మ‌ల్లికార్జున ఖ‌ర్గే సీరియ‌స్

Mallikarjun Kharge : అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ లోని త‌వాంగ్ స‌రిహ‌ద్దు వ‌ద్ద భార‌త్, చైనా దేశాల మధ్య చోటు చేసుకున్న వివాదంపై మ‌రోసారి రాద్ధాంతం చోటు చేసుకుంది. రాజ్య‌స‌భ‌లో ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే(Mallikarjun Kharge)  సీరియ‌స్ అయ్యారు. దేశానికి సంబంధించిన సీరియస్ అంశంపై ఎందుకు చ‌ర్చించ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. ఇందులో ఏం త‌ప్పు ఉందంటూ నిప్పులు చెరిగారు.

దీనిపై జోక్యం చేసుకున్నారు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్. ఇవాళ స‌మ‌స్య తీవ్ర‌త‌రం కావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం కాంగ్రెస్ పార్టీనేనంటూ ఆరోపించారు. ఆనాటి ప్ర‌ధాన‌మంత్రి జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ స‌రైన రీతిలో స్పందించ‌క పోవ‌డం వ‌ల్ల‌నే ఇవాళ ఇన్ని స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ని పేర్కొన్నారు పీయూష్ గోయ‌ల్.

ఇదిలా ఉండ‌గా భార‌త్, చైనా దేశాల మ‌ధ్య చోటు చేసుకున్న స‌రిహ‌ద్దు వివాదంపై త‌ప్ప‌నిస‌రిగా చ‌ర్చ జ‌ర‌గాల‌ని ప‌ట్టు ప‌ట్టాయి ప్ర‌తిప‌క్షాలు. దీనిపై స్పందిస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే(Mallikarjun Kharge) . రాజ్య‌స‌భ చైర్మ‌న్ జ‌గ‌దీప్ ధ‌న్ ఖ‌ర్ ను కోరినా స్పందించ‌క పోవ‌డం దారుణ‌మ‌న్నారు.

గతంలో త‌మ పార్టీ పాల‌న‌లో అన్ని స‌మ‌స్య‌ల‌ను ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించామ‌ని, ఇత‌ర పార్టీల‌కు కూడా అనుమ‌తి ఇవ్వ‌డం కూడా జ‌రిగంద‌ని గుర్తు చేశారు. కానీ ప్ర‌స్తుత బీజేపీ స‌ర్కార్ కావాల‌ని అడ్డుకుంటుందోన‌ని ఆరోపించారు.

రాజ్య‌స‌భ చైర్మ‌న్ జ‌గ‌దీప్ ధ‌న్ ఖ‌ర్ అనుస‌రిస్తున్న తీరు దారుణ‌మ‌న్నారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. చ‌ర్చించ‌కుండా చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌ని పేర్కొన్నారు.

Also Read : క‌దం తొక్కిన‌ లింగాయత్‌లు

Leave A Reply

Your Email Id will not be published!