Bhatti Vikramarka : దోపిడీకి చిరునామా దొర పాలన
నిప్పులు చెరిగిన సీఎల్పీ నేత భట్టి
Bhatti Vikramarka : కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాల ఊసే లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. పీపుల్స్ మార్చ్ యాత్రలో భాగంగా సూర్యాపేటలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయనకు జనం నుంచి ఆదరణ లభిస్తోంది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో కొలువు తీరిన భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రభుత్వాన్ని ఏకి పారేశారు.
దొరతనానికి కేరాఫ్ గా సర్కార్ మారిందని ధ్వజమెత్తారు. ఇసుక, ల్యాండ్ మాఫియా రెచ్చి పోతోందని, అక్రమార్కులకు అడ్డు అదుపు లేకుండా పోయిందని మండిపడ్డారు మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka). రాష్ట్రంలో 2 లక్షలకు పైగా ఖాళీలు ఉంటే ఒక్క పోస్టు కూడా భర్తీ చేసిన పాపాన పోలేదని మండిపడ్డారు. కేవలం ఆసాములకు మాత్రమే రైతు బంధు వల్ల లాభం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని , కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ధరణి లో చోటు చేసుకున్న అవకతవకలను వెలుగులోకి తీసుకు వస్తామన్నారు. ధరణిని తాము పవర్ లోకి వచ్చాక రద్దు చేస్తామని హెచ్చరించారు. ఏ ఒక్కరినీ వదిలి పెట్టబోమంటూ స్పష్టం చేశారు.
రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, బాధ్యతా రాహిత్యంతో అధికారులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తాము వచ్చాక మొత్తాన్ని ప్రక్షాళన చేస్తామని హెచ్చరించారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క.
Also Read : Pawan Kalyan : నాది ఆవేశం కాదు ఆవేదన – పవన్
