Mamata Banerjee : ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ నివాసంపై ఆర్టీసీ కార్మికులు దాడికి పాల్పడడం దారుణమని పేర్కొన్నారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee). ఇది మంచి పద్దతి కాదని సూచించారు.
ఈ దాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ ( ఎంఎస్ఆర్టీసీ ) ఉద్యోగులు గత కొంత కాలంగా సమ్మె చేస్తున్నారు.
100 మందికి పైగా ఉద్యోగులు ఈనెల 8న శరద్ పవార్ నివాసంపై అకస్మాత్తుగా దాడి చేశారు. శరద్ పవార్ కూతురు, లోక్ సభ సభ్యురాలు సుప్రియా సూలే ఆందోళనకారులను శాంతింప చేసేందుకు ప్రయత్నించినా ఫలించ లేదు.
ఎట్టకేలకు పోలీసులు రంగంలోకి దిగారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా 107 మందిపై కేసు నమోదు చేశారు.
మహారాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నం చేయడం లేదంటూ ఆరోపించారు ఆర్టీసీ కార్మికులు.
ప్రభుత్వం కావాలని తమను పట్టించు కోవడం లేదంటూ మండిపడ్డారు. తాము సంస్థను కాపాడేందుకు ప్రయ్నతం చేశామని కానీ కార్మికులే ముందుకు రావడం లేదని మరాఠా సర్కార్ అంటోంది.
ఈ తరుణంలో పెద్ద ఎత్తున కార్మికులు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నది ఎన్సీపీకి చెందిన రోడ్డు రవాణా సంస్థ మంత్రినే కారణమంటూ ఆరోపించారు.
ఈ తరుణంలో పవార్ నివాస్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ట్విట్టర్ లో మమతా బెనర్జీ (Mamata Banerjee)పేర్కొన్నారు. సుదీర్గ రాజకీయ అనుభవం కలిగిన పవార్ నివాసంపై దాడికి దిగడం తనను బాధ కలిగించిందని తెలిపారు దీదీ.
Also Read : వ్యాక్సిన్ ధరల మోతపై ఆగ్రహం