Mamata Banerjee : మహూవా మోయిత్రాపై దీదీ కామెంట్స్
తప్పులు చేస్తారు ఆపై సరిదిద్దుకుంటారు
Mamata Banerjee : కాళీ దేవీ పోస్టర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు టీఎంసీ ఎంపీ మహూవా మోయిత్రా. ఇదే విషయంపై రాద్దాంతం చెలరేగడం, బీజేపీ దీనిని తప్పు పట్టడం, ఆపై కేసు నమోదు చేసేంత దాకా వెళ్లింది.
ఇదే సమయంలో ఎంపీకి సపోర్ట్ గా నిలిచారు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్. ఈ దేశంలో భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ఏమిటంటే ప్రశ్నించడం. వ్యాఖ్యానించడం.
దీనిని కూడా కాదనే హక్కు భారతీయ జనతా పార్టీ శ్రేణులకు లేదని స్పష్టం చేశారు. ఈ తరుణంలో గురువారం టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన కామెంట్స్ చేశారు.
ఇప్పటికే తమ పార్టీ ఖండంచిందని, ఆమె వ్యక్తిగత వ్యాఖ్యలుగా పేర్కొందని తెలిపారు. ఇదిలా ఉండగా మనుషులన్నాక తప్పులు చేస్తారని, వాటిని సరిదిద్దుకుంటారని చెప్పారు మమతా బెనర్జీ(Mamata Banerjee).
కొంత మంది చేసిన మంచి పనుల్ని చూడరని, కానీ లేని వాటికి, ప్రాధాన్యత కాని వాటికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారని బీజేపీని ఉద్దేశించి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు సానుకూలంగా ఆలోచించాలని సూచించారు సీఎం.
ఇదిలా ఉండగా దేవత ధూమపానం చేస్తూ చిత్ర నిర్మాత లీనా మణిమేకలై షేర్ చేసిన ఫిల్మ్ పోస్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేయడంపై స్పందించాల్సిందిగా మహూవాను అడిగారు.
ప్రతి వ్యక్తికి తమదైన రీతిలో దేవుడిని పూజించే హక్కు ఉన్నందు వల్ల కాళీ దేవిని మాంసాహారం , మద్యం స్వీకరంచే దేవతగా ఊహించుకునే హక్కు తనకు వ్యక్తిగతంగా ఉందన్నారు టీఎంసీ ఎంపీ.
Also Read : ఎవరీ లీనా మణిమేకలై ఏమిటా కథ