Mamata Banerjee : మృతుల కుటుంబాల‌కు రూ. 5 ల‌క్ష‌లు

ప్ర‌క‌టించిన సీఎం మ‌మతా బెన‌ర్జీ

Mamata Banerjee : ఒడిశా రాష్ట్రంలోని బాలా సోర్ జిల్లాలో చోటు చేసుకున్న కోర‌మాండ‌ల్ ఎక్స్ ప్రెస్ దుర్ఘ‌ట‌న‌లో చ‌ని పోయిన వారికి రూ. 5 ల‌క్ష‌ల చొప్పున ప‌రిహారం ప్ర‌క‌టించారు ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ(Mamata Banerjee). ఆమె విష‌యం తెలిసిన వెంట‌నే ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఈ ఘ‌ట‌న‌లో ప్రాణాలు కోల్పోయిన త‌మ రాష్ట్రానికి చెందిన వారికి భ‌రోసా క‌ల్పించే ప్ర‌య‌త్నం చేశారు. గాయ‌ప‌డిన వారికి కూడా ఆర్థిక సాయం అందజేస్తామ‌ని తెలిపారు.

స‌హాయ‌క చ‌ర్య‌ల్లో భాగంగా త‌మ ప్ర‌భుత్వం ఇప్ప‌టికే 50 మంది వైద్యుల‌ను , రెండు వాహ‌నాల‌ను కూడా పంపింద‌ని చెప్పారు. బాధితుల‌ను ప‌రామ‌ర్శించిన అనంత‌రం మీడియాతో మాట్లాడారు మ‌మ‌తా బెన‌ర్జీ. ఒక ర‌కంగా నిప్పులు చెరిగారు కేంద్ర స‌ర్కార్ పై. యాంటీ కొలిజ‌న్ ప‌రిక‌రాన్ని గ‌నుక ఏర్పాటు చేసిన‌ట్ల‌యితే ఇంత‌టి ఘోరం జ‌రిగి ఉండేది కాద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు ప‌శ్చిమ బెంగాల్ సీఎం.

ఇదిలా ఉంగా మ‌మ‌తా బెన‌ర్జీ రెండు సార్లు రైల్వే శాఖ మంత్రిగా ప‌ని చేశారు. ఒక‌సారి బీజేపీ ఎన్డీయే ప్ర‌భుత్వంలో మ‌రోసారి యూపీఏ హ‌యాంలో ఆమె కీల‌క ప‌ద‌విని చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణ‌వ్ ను ఏకి పారేశారు. ఎందుకు ప‌రిక‌రాన్ని ఏర్పాటు చేయ‌లేద‌ని ప్ర‌శ్నించారు. కోర‌మాండ‌ల్ అత్యుత్త‌మ ఎక్స్ ప్రెస్ రైళ్ల‌లో ఒక‌టి అని తెలిపారు దీదీ. 21వ శతాబ్దంలో అతి పెద్ద రైల్వే ప్ర‌మాదంగా ఆమె పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా రైలు దుర్ఘ‌ట‌న‌లో బాధితుల‌కు రూ. 10 ల‌క్ష‌ల చొప్పున రైల్వే శాఖ ప్ర‌క‌టించింది.

Also Read : CJI DY Chandrachud

 

Leave A Reply

Your Email Id will not be published!