Mamata Banerjee Modi : మోదీతో భేటీ కానున్న దీదీ
నీతి ఆయోగ్ మీటింగ్ కు హాజరు
Mamata Banerjee Modi : తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ ) చీఫ్ , పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఢిల్లీకి బయలు దేరారు. శనివారం దేశంలోని అత్యున్నత పదవిగా భావించే ఉప రాష్ట్రపతి పదవికి ఎన్నికలు జరగనున్నాయి.
ఈ తరుణంలో ఆదివారం నీతి ఆయోగ్ సమావేశం జరగనుంది. ఈ కీలక మీటింగ్ లో ఆయా రాష్ట్రాలకు చెందిన సీఎంలు పాల్గొననున్నారు.
ఇక ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ తరపు నుంచి జగదీష్ ఖక్కర్ , విపక్షాల నుంచి ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి మార్గరెట్ అల్వా బరిలో ఉన్నారు.
ఇది పక్కన పెడితే ఇటీవల ఊహించని రీతిలో కేంద్రం షాకిచ్చింది. మమతా బెనర్జీకి(Mamata Banerjee) అండగా ఉంటూ వచ్చిన కేబినెట్ మంత్రి పార్థ ఛటర్జీ ని ఈడీ అదుపులోకి తీసుకుంది.
అవినీతి మరకలు దీదీని గుక్క తీయనీకుండా చేసింది. చివరకు కేబినెట్ ను విస్తరించింది మొదటిసారిగా. భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఐదుగురు కొత్త ముఖాలకు చోటు కల్పించింది.
బీజేపీలో ఉంటూ కేంద్ర మంత్రిగా , ఎంపీ పదవికి రాజీనామా చేసి టీఎంసీలో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందిన బాబుల్ సుప్రియోకు చాన్స ఇచ్చింది మంత్రిగా.
ఈ తరుణంలో మమతా బెనర్జీ గురువారం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఇందులో ఈడీ , తదితర అంశాలు కూడా ప్రస్తావించనున్నారు మమతా బెనర్జీ. మొత్తంగా దీదీ మోదీ(PM Modi) భేటీపై ఎంతో ఉత్కంఠను రేపుతోంది.
ఇదిలా ఉండగా సీఎం దీదీతో నిత్యం ఘర్షణ పడ్డారు గవర్నర్ గా పని చేసిన జగదీప్ ధన్ ఖర్. కానీ ఆమెకు చుక్కలు చూపించేందుకు ఆయనను ఉప రాష్ట్రపతి బరిలో నిలబెట్టింది.
Also Read : సోనియా..రాహుల్ కు కోలుకోలేని షాక్