Mamata Banerjee : బీజేపీని గద్దె దించేందుకు సిద్దం – సీఎం
నిప్పులు చెరిగిన మమతా బెనర్జీ
Mamata Banerjee : టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) షాకింగ్ కామెంట్స్ చేశారు. వచ్చే 2024లో జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గద్దె దించడం ఖాయమన్నారు.
గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. తామంతా ఐక్యంగా పోరాడుతామని చెప్పారు. ఇప్పటికే బీజేపీతో తెగదెంపులు చేసుకున్న బీహార్ సీఎం నితీశ్ కుమార్ రంగంలోకి దిగారు.
మరో వైపు కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ(Rahul Gandhi) 150 రోజుల భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టారు. భారీ ఎత్తున స్పందన లభిస్తోంది.
ఈ తరుణంలో విపక్షాలన్నీ ఐక్యం కావాల్సిన అవసరం ఉందని మరోసారి స్పష్టం చేశారు నితీశ్ కుమార్(Nitish Kumar). మమతా బెనర్జీని టార్గెట్ చేస్తూ వస్తోంది కేంద్రం.
ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. సమన్లు, నోటీసులు ఇస్తూ ఊపిరాడకుండా చేస్తున్నాయి. కేంద్రం కావాలనే తమపై కేసులు నమోదు చేయిస్తోందంటూ ఆరోపించారు మమతా బెనర్జీ.
బీజేపీ అహంకార పూరితంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. అంతే కాకుండా మోదీ ఎనిమిదేళ్ల పాలన లో ఎనిమిది బీజేపీయేతర రాష్ట్రాలను కూల్చారంటూ ఆరోపించారు.
అన్ని రంగాలలో దేశం వెనుకబడి పోయిందని త్వరలోనే మోదీకి మంగళం పాడేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారంటూ జోష్యం చెప్పారు సీఎం.
బీహార్ సీఎం నితీశ్ కుమార్ , జార్కండ్ సీఎం హేమంత్ సోరేన్(Hemant Soren) , సమాజ్ వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ , అనేక మంది నాయకులు కలిసి వస్తారని 2024లో ఐక్యంగా పోటీ చేస్తారని స్పష్టం చేశారు మమతా బెనర్జీ.
కోల్ కతాలో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఆమె ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read : పెరిగిన కరోనా కేసులతో పరేషాన్