Mamata Banerjee : వంగ భూమిని ముక్కలు కానివ్వను – దీదీ
సీఎం మమతా బెనర్జీ షాకింగ్ కామెంట్స్
Mamata Banerjee : టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె మరోసారి భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేశారు. మోదీ త్రయం (మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా ) ఎన్ని కుట్రలు పన్నినా వారి ఆటలు సాగవన్నారు.
కులాలు, మతాలు, ప్రాంతాలు, వర్గాల పేరుతో మనుషుల మధ్య విభేదాలు సృష్టిస్తూ రాజకీయంగా పబ్బం గడుపుకునే స్థాయికి బీజేపీ దిగజారిందని ఆరోపించారు.
వారి కుట్రలు, కుయుక్తులు పశ్చిమ బెంగాల్ లో సాగవన్న నిజం ఇటీవల రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిరూపించారని అన్నారు.
ఇక కలిసి ఉన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని ముక్కలు చేసి లబ్ది పొందాలని చూస్తున్నారని కానీ వారికి తాను ఈ భూమి మీద ఉన్నంత వరకు కానివ్వబోనంటూ స్పష్టం చేశారు.
అవసరమైతే తన ప్రాణాలను అర్పిస్తాను కానీ ఈ వంగ భూమి ( పశ్చిమ బెంగాల్ )ని ముక్కలు చేసేందుకు ఒప్పుకోనని హెచ్చరించారు. రాజకీయంగా తనను ఎదుర్కొనే శక్తి లేక దొడ్డి దారిన కుట్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు మమతా బెనర్జీ .
రాష్ట్ర, కేంద్ర బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒకసారి ప్రత్యేక గూర్ఖాలాండ్ అంటారు. మరోసారి నార్త్ బెంగాల్ కావాలంటారు. ఏది ఏమైనా రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వ బోనంటూ నిప్పులు చెరిగారు.
అవసరమైతే రాష్ట్రం కోసం నా రక్తం చిందిస్తానని అన్నారు. గుండెపై తుపాకీ ఎక్కు పెట్టినా తన నిర్ణయం మారదన్నారు. ప్రస్తుతం మమతా బెనర్జీ(Mamata Banerjee) చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.
Also Read : జైన్ నివాసాల్లో రూ. 2 కోట్ల నగదు లభ్యం