Mamata Banerjee : నియంతలను తలపిస్తున్న బీజేపీ పాలన
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
Mamata Banerjee : తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన కామెంట్స్ చేశారు. దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ పాలన ఆనాటి నియంతల్ని తలపింప చేస్తోందంటూ ఆరోపణలు చేశారు.
హిట్లర్ , ముస్సోలినీ, స్టాలిన్ ల పాలన కంటే అధ్వాన్నంగా ఉందంటూ ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యం దేశంలో అన్నది ఉందా అన్న అనుమానం కలుగుతోందని పేర్కొన్నారు మమతా బెనర్జీ(Mamata Banerjee).
డెమోక్రసీని పరిరక్షించేందుకు కేంద్ర సంస్థలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు దొడ్డి దారిన కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తోందని మండిపడ్డారు.
బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం దేశంలోని సమాఖ్య నిర్మాణాన్ని బుల్డోజర్ చేస్తోందంటూ ఆరోపించారు సీఎం. మోదీ ప్రభుత్వం ప్రజలను బహిరంగంగా లూటీ చేస్తోందంటూ ధ్వజమెత్తారు.
గత కొంత కాలంగా దేశంలో బీజేపీయేతర ప్రభుత్వాలను, వ్యక్తులను, వ్యవస్థలను, సంస్థలను , కంపెనీలను టార్గెట్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తోందంటూ మండిపడ్డారు.
నేరుగా అయితే జోక్యం చేసుకోలేమని తెలుసుకున్న మోదీ దొడ్డి దారిన దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తూ, భయభ్రాంతులకు గురి చేస్తూ , కేసులు నమోదు చేయిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు సీఎం మమతా(Mamata Banerjee) .
రాబోయే రోజుల్లో బీజేపీ ఎన్డీయే సర్కార్ కు పుట్ట గతులు ఉండవని జోష్యం చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే తుగ్లక్ పాలన దేశంలో కొనసాగుతోందని ఫైర్ అయ్యారు.
Also Read : జపాన్ తో భారత్ బంధం బలీయం