Mamata Banerjee Cabinet : మమత కేబినెట్ లో బాబుల్ కు చోటు
మాజీ బీజేపీ నేతకు ఫస్ట్ ప్రయారిటీ
Mamata Banerjee Cabinet : ఎవరూ ఊహించని రీతిలో నిర్ణయాలు తీసుకోవడంలో తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నారు టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.
ఈడీ దెబ్బకు తన కేబినెట్ లో సీనియర్ నాయకుడైన పార్థ ఛటర్జీని అరెస్ట్ చేయడంతో క్యాబినెట్ లో మార్పులు చేయాలని డిసైడ్ అయ్యింది.
ఎవరు ఉంటారనే దానిపై నెలకొన్న ఉత్కంఠకు తెర దించింది మేడం. భారతీయ జనతా పార్టీలో ఉంటూ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఎంసీలో చేరిన ప్రముఖ గాయకుడు, నాయకుడు బాబుల్ సుప్రియో కు కేబినెట్ లో చోటు కల్పించింది.
పూర్తిగా ఆయనకు కేబినెట్ ర్యాంక్ కేటాయించింది. పార్థ ఛటర్జీ సీఎం మమతా బెనర్జీకి కుడి భుజంగా ఉన్నారు. 2011లో అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ మార్పులు చేసేందుకు శ్రీకారం చుట్టారు.
మంత్రివర్గంలో ఐదుగురు కొత్త వారికి ఛాన్స్ ఇచ్చింది. ఇక బాబుల్ సుప్రియో బీజేపీలో కీలకమైన నేతగా ఎదిగారు. ఆపై కేంద్ర కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు.
మలి విడత విస్తరణలో ఆయనకు చోటు దక్కలేదు. దీంతో తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. ఆ తర్వాత మనసు మార్చుకున్నారు. టీఎంసీలో చేరారు.
తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో నటుడు శత్రుఘ్న సిన్హా గెలుపొందారు ఎంపీగా. ఎమ్మెల్యేగా బాబుల్ సుప్రియో ఘన విజయం సాధించారు.
ఇక తాజాగా ప్రకటించిన ఐదుగురులో బాబుల్ కు కీలకమైన ఐటీ, టూరిజం శాఖలు కేటాయించారు(Mamata Banerjee Cabinet). స్నేహ శిష్ చక్రవర్తి, పార్థ భౌమిక్ , ఉదయన్ గుహా , ప్రదీప్ ముజుందార్ లకు కీలక మంత్రిత్వ శాఖలు దక్కాయి.
Also Read : సోనియా..రాహుల్ గాంధీకీ ఈడీ షాక్