Mamata Banerjee : మార్గరెట్ అల్వాకు మమత మద్దతు
సోనియా, విపక్షాలకు సీఎం హామీ
Mamata Banerjee : ఎట్టకేలకు టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బెట్టు వీడారు. తమ పార్టీ బేషరతుగా విపక్షాల ఉమ్మడి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో ఉన్న మార్గరెట్ అల్వాకు(Margaret Alva) సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
ఈ మేరకు ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ, విపక్షాల నాయకులకు హామీ ఇచ్చారు దీదీ. ఇదిలా ఉండగా అమర వీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కోల్ కతాలో జరిగిన భారీ ర్యాలీని ఉద్దేశించి టీఎంసీ ప్రధాన కార్యదర్శి, అల్లుడు అయిన అభిషేక్ బెనర్జీ సంచలన కామెంట్స్ చేశారు.
తమ పార్టీని సంప్రదించకుండానే ఉప రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించారని అందుకే 36 మందితో కూడిన టీఎంసీ ఎంపీలు ఓటు వేయకుండా ఉంటారని వెల్లడించారు.
ఇది తీవ్ర దుమారానికి దారి తీసింది. ఈ సందర్భంగా మార్గరెట్ అల్వా మమతా బెనర్జీపై(Mamata Banerjee) ట్వీట్ చేశారు. అహం ఉండడం మంచిదే కానీ అకారణ కోపం మంచిది కాదని సూచించారు.
ఈ తరుణంలో సోనియాతో పాటు ఇతర నేతలు కూడా మమతా బెనర్జీతో మాట్లాడారు. దీంతో మనసు మార్చుకున్నారు బెంగాల్ సీఎం. ఈ మేరకు తాము బేషరతుగా మార్గరెట్ అల్వాకు మద్దతు ఇస్తామని శుక్రవారం ప్రకటించారు.
దీంతో తుపానులో టీ కప్పు లాగా మారింది ఈ వ్యవహారం. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థి ఎవరైనా సరే తృణమూల్ కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని ప్రకటించారు మమతా బెనర్జీ.
ఈ మేరకు స్పష్టమైన హామీ సోనియా గాంధీకి ఇచ్చారని సమాచారం.
Also Read : దీదీ కోపానికి ఇది సమయం కాదు