Margaret Alva : దీదీ కోపానికి ఇది స‌మ‌యం కాదు

ఉప రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి మార్గ‌రెట్ అల్వా

Margaret Alva : ప్ర‌తిప‌క్షాల ఉమ్మ‌డి ఉప రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థ‌గా బ‌రిలో ఉన్న కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కురాలు మార్గెరెట్ అల్వా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

అమ‌ర వీరుల సంస్మ‌ర‌ణ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని జ‌రిగిన స‌మావేశంలో మ‌మ‌తా బెన‌ర్జీ(Mamatha Banerjee) అల్లుడు, టీఎంసీ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అభిషేక్ బెన‌ర్జీ అల్వాకు మ‌ద్ద‌తు ఇవ్వ‌బోమంటూ ప్ర‌క‌టించారు.

త‌మ‌ను సంప్ర‌దించ‌కుండానే ఇలాంటి నిర్ణ‌యం తీసుకున్నారంటూ ఆరోపించారు. దీనిపై తాజాగా స్పందించారు మార్గరెట్ అల్వా(Margaret Alva). ఈ సంద‌ర్భంగా అహం ఉండ‌డం మంచిదే, కానీ అకార‌ణ కోపం ఉండ‌డం భావ్యం కాద‌ని సూచించారు టీఎంసీ చీఫ్ మ‌మ‌తా బెన‌ర్జీకి.

ఎన్నిక‌ల్లో ఓటింగ్ కు దూరంగా ఉండ‌డం అంటే ప్ర‌జా స్వామ్యాన్ని అప‌హాస్యం చేస్తున్న‌ట్లుగా భావించాల్సి వ‌స్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి ట్వీట్ చేశారు శుక్ర‌వారం .

ప్ర‌స్తుతం మార్గ‌రెట్ అల్వా చేసిన ఈ వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి. ఇది ధైర్యం, నాయ‌క‌త్వం, ఐక్య‌త‌కు స‌మ‌యం. నేను న‌మ్ముతున్నాను.

దీదీ ధైర్యానికి ప్ర‌తీక‌. ప్ర‌తిప‌క్షాల‌కు అండ‌గా నిలుస్తార‌న్న న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌ని స్ప‌ష్టం చేశారు మార్గ‌రెట్ అల్వా. ఇదిలా ఉండ‌గా రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్షాల‌లో ఒక‌టిగా ఉన్న శివ‌సేన య‌శ్వంత్ సిన్హాను కాద‌ని ద్రౌప‌ది ముర్ముకు మ‌ద్ద‌తు ఇచ్చారు.

దీంతో విప‌క్షాల‌లో చీల‌క వ‌చ్చిన‌ట్లు భావిస్తున్నారు రాజ‌కీయ వ‌ర్గాలు. రాజ‌కీయ పార్టీలు త‌మ ప్ర‌యోజ‌నాల‌కు అనుగుణంగానే ప‌ని చేస్తాయ‌ని దీంతో బోధ ప‌డింద‌న్నారు నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ నాయ‌కుడు ఫ‌రూక్ అబ్దుల్లా.

Also Read : ఆప్ జైలుకు భ‌య‌ప‌డ‌దు – కేజ్రీవాల్

Leave A Reply

Your Email Id will not be published!