Manda Karnel Joins : బీజేపీలో చేరిన మందకృష్ణ సోదరుడు
కండువా కప్పి ఆహ్వానించిన ఈటల రాజేందర్
Manda Karnel : గజ్వేల్ – తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. వివిధ పార్టీలకు చెందిన నేతలు జంప్ అవుతున్నారు. తాజాగా ప్రముఖ ఉద్యమకారుడు , మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్పీఎస్) చీఫ్ మందకృష్ణ మాదిగ సోదరుడు మంద కార్నెల్ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆయన తన సోదరుడితో కలిసి గత కొన్నేళ్లుగా పలు ఉద్యమాలు, పోరాటాలు, ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలలో పాల్గొన్నారు. తన అన్నకు అండగా వెంట ఉంటూ వచ్చారు.
Manda Karnel Join in BJP
ఇదిలా ఉండగా బీజేపీలోకి మంద కార్నెల్ ను కమలం జెండా కప్పి ఆహ్వానించారు. వరంగల్ నుండి గజ్వేల్ కు వచ్చిన సందర్బంగా కార్నెల్ ను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు స్పష్టం చేశారు మాజీ మంత్రి , గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ .
మంద కృష్ణ మాదిగకు(Manda Krishna Madiga) ఉద్యమ నేపథ్యం ఉంది. మాదిగలకు ఏబీసీడీ రిజర్వేషన్ కావాలని కోరుతూ వస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీ తాము వర్గీకరణ జరుపుతామంటూ ముందుకు వచ్చింది. సికింద్రాబాద్ లో మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విశ్వ రూప సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
Also Read : Mansoor Ali Khan : త్రిష..ఖుష్బూ..మెగాస్టార్ పై ఖాన్ ఫైర్