PM Modi : సికింద్రాబాద్ – ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న సభలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. మాదిగల విశ్వరూప సభను నిర్వహించారు. భారీ ఎత్తున మాదిగ సోదర, సోదరీమణులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పీఎంను చూసి ఉద్వేగానికి లోనయ్యారు మందకృష్ణ మాదిగ. ఆయన కన్నీటి పర్యంతం అయ్యారు. ఎస్సీల వర్గీకరణ కోసం కొన్నేళ్లుగా అలుపెరుగని పోరాటం చేస్తూ వచ్చారు.
PM Modi Support Manda Krishna
గత కొంత కాలంగా ఆయన ఎక్కని మెట్టు లేదు. దిగని మెట్టు లేదు. అన్ని ప్రభుత్వాలతో చర్చలు జరుపుతూ వచ్చారు. సామాజిక న్యాయం కావాలంటే మాదిగలకు రిజర్వేషన్ తప్పనిసరి కావాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే సమయంలో కేంద్రంలో కొలువు తీరిన ప్రధానమంత్రి మోదీని(PM Modi) కూడా కలుసుకున్నారు.
అశేష మాదిగలను చూసి సంతోషానికి గురయ్యారు మోదీ. మందకృష్ణ మాదిగను తన సోదరుడిగా పేర్కొన్నారు. మాదిగలను ఆదుకుంటానని, వారికి సముచిత స్థానం కల్పిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో మీకు జరుగుతున్న అన్యాయం తనను కలిచి వేసిందన్నారు. ఈ సందర్భంగా తనను చూసి ఉద్వేగానికి లోనైన మందకృష్ణ మాదిను ఓదార్చారు.
Also Read : Valluru Kranti : ఓటు కోసం వినూత్న ప్రచారం