Manda Krishna Rahul : రాహుల్ యాత్రకు మందకృష్ణ మద్దతు
యాత్రలో పాల్గొన్న ఎంఆర్పీఎస్ చీఫ్
Manda Krishna Rahul : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి చీఫ్ మందకృష్ణ మాదిగ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. మాదిగలకు రిజర్వేషన్లు కావాలని కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నారు. ఆదివారం ప్రారంభమైన యాత్రలో ప్రజా సంఘాల నాయకులు, మేధావులు, న్యాయవాదులు పాల్గొనడం విశేషం.
ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తో పాటు మంద కృష్ణ మాదిగ రాహుల్ గాంధీతో(Manda Krishna Rahul) యాత్రలో పాల్గొన్నారు. ఆయన చేతులు పట్టుకుని అడుగులో అడుగులు వేశారు. అన్ని వర్గాలకు చెందిన ప్రజలు రాహుల్ యాత్రను సమాదరిస్తున్నారు. అడుగడుగునా రాహుల్ కు జనం బ్రహ్మరథం పట్టారు.
ఇదిలా ఉండగా నవంబర్ 7న తెలంగాణలో ఆయన చేపట్టిన యాత్ర ముగుస్తుంది. ఇప్పటి వరకు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో యాత్ర పూర్తయింది. మరో వైపు సినీ రంగానికి చెందిన పూనమ్ కౌర్, పూజా భట్ రాహుల్ యాత్రలో పాల్గొన్నారు.. పూర్తిగా సంఘీభావం తెలిపారు.
ఇదే సమయంలో మరో నటి స్వర భాస్కర్ కితాబు ఇచ్చారు రాహుల్ గాంధీకి. ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ రాహుల్ చేపట్టిన యాత్ర ప్రశంసించడం విశేషం. ఈ సందర్బంగా మందకృష్ణ మాదిగ మాట్లాడారు. దేశంలో రాహుల్ గాంధీ చేపట్టిన యాత్రతో పెను మార్పు రావడం ఖాయమన్నారు.
తనతో రాహుల్ గాంధీ ఆప్యాయంగా మాట్లాడారని, మాదిగలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటని అడిగి తెలుసుకున్నారని చెప్పారు మంధకృష్ణ మాదిగ. ఇదిలా ఉండగా ఈనెల 7న తెలంగాణలో ముగుస్తుంది రాహుల్ యాత్ర. అదే రోజు మరాఠాలోకి ప్రవేశిస్తుంది.
Also Read : రాహుల్ యాత్రలో ప్రశాంత్ భూషణ్