Mandava Venkateswara Rao : హస్తం గూటికి ‘మండవ’
బీఆర్ఎస్ కు బిగ్ షాక్
Mandava Venkateswara Rao : భారత రాష్ట్ర సమితికి చెందిన సీనియర్ నాయకుడు , మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర రావు పార్టీ మారనున్నారా. అవునని అంటున్నారు ఆయన అనుచర వర్గం. గతంలో టీడీపీ హయాంలో కీలక పదవిలో ఉన్నారు. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మండవ వెంకటేశ్వర్ రావు(Mandava Venkateswara Rao) గులాబీ కండువా కప్పుకున్నారు.
Mandava Venkateswara Rao Viral
ఆయనకు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో మంచి పట్టుంది. గతంలో తెలుగుదేశం పార్టీలో కీలకమైన నాయకులు ఉన్న వారంతా పక్క చూపు చూస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి ఒకప్పుడు టీడీపీలో ఉన్న వారే.
ఆయన స్వయంగా మాజీ మంత్రి , ఖమ్మం జిల్లాలో మంచి పట్టు కలిగిన నాయకుడిగా ఉన్న తుమ్మల నాగేశ్వర్ రావు ఇంటికి వెళ్లారు. కాంగ్రెస్ లో చేరాల్సిందిగా కోరారు. అందుకు తుమ్మల కూడా సమ్మతి తెలిపారు. తాజాగా ప్రకటించిన జాబితాలో తుమ్మల నాగేశ్వర్ రావు పేరు ఉంటుందని అనుకున్నారు. కానీ ఆయన పేరు లేకుండా చేశారు బీఆర్ఎస్ బాస్ , సీఎం కేసీఆర్.
దీంతో మనసు నొచ్చుకున్నారు తుమ్మల నాగేశ్వర్ రావు. ఆయన కాంగ్రెస్ వైపు వెళ్లేందుకు డిసైడ్ అయ్యారు. ఈ తరుణంలో మండవ వెంకటేశ్వర్ రావు కూడా జంప్ అయితే బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలినట్లవుతుంది.
Also Read : Vijay Sai Reddy : విజినరీ అంటే దోచుకోవడమా