Mangampeta Villagers : వైన్ షాపుల కోసం గ్రామస్థుల తీర్మానం
పెస గ్రామ సభ హల్ చల్
Mangampeta Villagers : మద్యం ప్రమాదకరమని ఓ వైపు వైద్యులు హెచ్చరిస్తుంటే మరో వైపు తెలంగాణలో జనం ఏకంగా తమకు మద్యం షాపులు కావాలంటూ కోరడం విస్తు పోయేలా చేసింది. ములుగు జిల్లా మంగపేట మండలంలో(Mangampeta Villagers) తమకు వైన్ షాపులు కావాలి అంటూ ఏకంగా తీర్మానం చేశారు. పెస గ్రామ సభ ద్వారా గిరిజన ప్రజలు ఈ మేరకు ఆమోదం తెలిపారు.
Mangampeta Villagers Asking
మండలంలోని మల్లూరు, వాగొడ్డుగూడెం గ్రామాల్లో ఈ మేరకు పెస గ్రామ సభలో పాల్గొన్నారు. ఆయా గ్రామాలకు చెందిన గిరిజన ఓటర్లంతా మూకుమ్మడిగా తమకు మద్యం షాపులు కావాలంటూ నినాదాలు చేశారు. వైన్ దుకాణాలు ఏర్పాటు కోసం ఆమోదం తెలుపుతున్నట్లు చేతులు పైకిత్తి నిర్ణయాన్ని తెలియ చేశారు.
ఇదిలా ఉండగా కోర్టు జోక్యం చేసుకుని ఇక్కడ మద్యం షాపుల నిర్వహణకు సంబంధించి స్టే విధించింది. మండలంలో గత 5 సంవత్సరాలుగా మద్యం షాపులు లేక పోవడాన్ని తీవ్రంగా పరిగణించారు గ్రామస్థులు. ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అటు ములుగు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మంగపేట మండలంలోని పెస గ్రామంతో పాటు సమీప గ్రామాల ప్రజలు హాట్ టాపిక్ గా మారారు. మద్యం ప్రభావం ఎంత ప్రమాదకర స్థాయికి చేరుకుందో దీన్ని బట్టి చూస్తే తెలుస్తుంది.
Also Read : Nee Chuttu Promo : రామ్..శ్రీలీల స్కంద సాంగ్ ప్రోమో