Manik Rao Thackeray : తెలంగాణ ప్రజలకు రుణపడి ఉన్నాం
సీనియర్ నాయకుడు మాణిక్ రావు ఠాక్రే
Manik Rao Thackeray : హైదరాబాద్ – తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అపూర్వమైన విజయాన్ని కట్టబెట్టినందుకు రాష్ట్ర ప్రజలందరికీ రుణపడి ఉంటామని స్పష్టం చేశారు మహారాష్ట్ర మాజీ పీసీసీ చీఫ్ , మాజీ హోం శాఖ మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే.
Manik Rao Thackeray Thanks
ఎన్నికల్లో ఫలితాలు అనంతరం ఆదివారం గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఒంటరి సైనికుడిలా పోరాటం చేశారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని అభినందించారు.
ప్రజలంతా కలిసి విస్పష్టమైన తీర్పు ఇచ్చారని , రాష్ట్రంలో మెరుగైన పాలన అందజేస్తుందని చెప్పారు మాణిక్ రావు ఠాక్రే . అంతే కాకుండా పార్టీ కార్యకర్తల పాత్ర ఉందన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నేతృత్వంలో ప్రచారం బాగా సాగిందన్నారు.
తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఈ గెలుపుతో తాము పొంగి పోమని , ప్రజల మన్ననలు అందుకుంటామని చెప్పారు మాణిక్ రావు ఠాక్రే.
Also Read : Ram Gopal Varma : కాబోయే సీఎం రేవంత్ – ఆర్జీవీ