Manik Saha : ఇది ప్రజల విజయం – మాణిక్ సాహా
గెలుపు సర్టిఫికెట్ అందుకున్న సీఎం
Manik Saha Tripura Results : త్రిపురలో స్పష్టమైన మెజారిటీ సాధించడం ఆనందంగా ఉందన్నారు సీఎం మాణిక్ సాహా(Manik Saha). ఈ ఎన్నికలు తమ పని తీరుకు దక్కిన ఫలితమన్నారు. సీపీఎం, కాంగ్రెస్ కలిసి పోటీ చేసినా చివరకు తమను ఏమీ చేయలేక పోయాయని ఎద్దేవా చేశారు.
సీఎం మాణిక్ సాహా టౌన్ బర్దోవాలి నియోజకవర్గం నుండి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆశీష్ కుమార్ సాహాపై 1,257 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆయన విజయం సాధించిన అనంతరం సర్టిఫికెట్ అందుకున్నారు.
ట్విట్టర్ వేదికగా ఆయన తన ఆనందాన్ని పంచుకున్నారు. తాను ముందు నుంచి చెబుతూనే వచ్చానని ప్రజలకు మరోసారి తమకే పట్టడం కడతారని అని అన్నారు. నేను బాగానే ఉన్నా. అంతకు మించిన సంతోషంగా ఉన్నానని చెప్పారు మాణిక్ సాహా(Manik Saha Tripura Results). గెలిచాక సర్టిఫికెట్ కూడా అందుకున్నా. జీవితంలో తాను మరిచి పోలేని క్షణం ఏదైనా ఉందంటే ఇవాళే అని పేర్కొన్నారు సీఎం. దీనికంటే మెరుగైనది ఇంక ఏముంటుందన్నారు..
భారతీయ జనతా పార్టీ, దాని మిత్ర పక్షమైన ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర 60 స్థానాలకు గాను 34 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. మెజారిటీ మార్క్ ను సాధించాయి. ఇక సీపీఎం, కాంగ్రెస్ పార్టీ కూటమి 14 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 31 సీట్లు రావాల్సి ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ఈశాన్యంలో మరోసారి పాగా వేసేందుకు రెడీ అవుతోంది. మొత్తంగా ఈ ఎన్నికలు బీజేపీకి ఒక బూస్ట్ లాగా ఉపయోగ పడతాయి.
Also Read : బీజేపీకి షాక్ కాంగ్రెస్ గెలుపు