Manikrao Thackeray : సీడబ్ల్యూసీ సమావేశం సక్సెస్ చేయాలి
ఏర్పాట్లపై మాణిక్ రావ్ ఠాక్రే కామెంట్స్
Manikrao Thackeray : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కీలకమైన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ మేరకు పార్టీ ఏరికోరి ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసింది. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎలాగైనా సరే సక్సెస్ చేయాలని, తన సత్తా ఏమిటో చూపించు కోవాలని పట్టుదలతో ఉన్నారు ఎనుముల రేవంత్ రెడ్డి.
Manikrao Thackeray Comments
ఇందులో భాగంగా బుధవారం హైదరాబాద్ లో టీపీసీసీ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. ఈ మీటింగ్ కు తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే(Manikrao Thackeray) హాజరై ప్రసంగించారు. పార్టీకి చెందిన బాధ్యులు, సీనియర్లు సీడబ్ల్యూసీ సమావేశాన్ని, ఆ తర్వాత చేపట్ట బోయే బహిరంగ సభ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర వార్షికోత్సవ కార్యక్రమం కూడా ప్రస్తుతం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. ఈ మూడు అతి ముఖ్యమైన కార్యక్రమాలని పార్టీ పరంగా ప్రతి ఒక్కరు బాధ్యతతో పని చేయాలని సూచించారు. త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయని అందులో భాగంగా కీలకమైన నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉందన్నారు.
Also Read : Komatireddy Venkat Reddy : కాంగ్రెస్ పై కోమటిరెడ్డి గుస్సా