Manipur Woman Parade : మణిపూర్ ఘటన యావత్ భారత దేశాన్ని, ప్రపంచాన్ని నివ్వెర పోయేలా చేసింది. రాష్ట్రంలో ఇంకా సాధారణ పరిస్థితులు నెలకొనలేదు. ఇప్పటి వరకు 100 మందికి పైగా చని పోయారు. 300 మందికి పైగా గాయపడ్డారు. 10 వేల మందికి పైగా సైనికులు మోహరించారు. అయినా దారుణాలు చొటు చేసుకుంటూనే ఉన్నాయి.
Manipur Woman Parade Issue
మణిపూర్(Manipur) లో పురుషుల గుంపు ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారం చేశారు. ఆపై వారిని నగ్నంగా ఊరేగించారు. ఈ ఘటన సభ్య సమాజాన్ని తల వంచుకునేలా చేసింది. మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన అత్యంత దారుణమైన ఘటన.
ఈ దారుణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది మరింత విస్తృతంగా ప్రచారం జరగడంతో ట్విట్టర్ , యూట్యూబ్ నుండి తొలగించారు. త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది.
విచిత్రం ఏమిటంటే భద్రతా బలగాలు భారీగా మోహరించినా, బహిరంగంగా ఇంత నిస్సంకోచంగా ఎలా ప్రవర్తించ గలిగారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇంతటి హింసోన్మాదం, దారుణం జరిగినా ఎలా తేలికగా తీసుకున్నారనేది అనుమానం రేకెత్తిస్తోంది.
Also Read : Congress Join : కాంగ్రెస్ లో భారీగా చేరికలు