Manipur Women Slams : మణిపూర్ పై మాట్లాడేందుకు 3 నెలలా
ప్రధాన మంత్రిపై మణిపూర్ వాసుల ఫైర్
Manipur Women Slams : మణిపూర్ అగ్ని గోళంగా తయారైంది. ఎక్కడ చూసినా దాడులు, దారుణాలు, సంఘటనలు చోటు చేసుకుంటున్నా కేంద్ర సర్కార్ మిన్నకుండి పోయిందన్న విమర్శలు లేక పోలేదు. ఈ దారుణాలు కుకీ వర్గంపై మేటీ వర్గాలు దాడులకు పాల్పడుతున్నా మోదీ ఎందుకు స్పందించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
Manipur Women Slams Modi
తాజాగా మణిపూర్ లో చోటు చేసుకున్న ఘటన యావత్ దేశాన్ని తల దించుకునేలా చేసింది. మేటి వర్గం ఇద్దరు కుకీ వర్గానికి చెందిన మహిళలను వివస్త్ర చేసి ఊరేగించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. చివరకు భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరణ ఇవ్వాలని ఆదేశించారు సీజేఐ డీవై చంద్రచూడ్(CJI DY_Chandrachud) ఆధ్వర్యంలోని ధర్మాసనం ఆదేశించింది. ఇప్పటి వరకు మణిపూర్ లో 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 300 మందికి పైగా గాయపడ్డారు. 50 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. 3 నెలల తర్వాత మోదీ నోరు విప్పారు. దీంతో ప్రధానికి బాధ్యత లేదా అంటూ మణిపూర్ వాసులు ప్రశ్నిస్తున్నారు.
Also Read : BJP MLA Paolienlal Haokip : మోదీపై బీజేపీ ఎమ్మెల్యే హౌకిప్ ఫైర్