Manish Sisodia CBI : సిసోడియా విచారణకు రావాల్సిందే
స్పష్టం చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ
Manish Sisodia CBI : ఢిల్లీ లిక్కర్ స్కీంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు కోలుకోలేని షాక్ ఇచ్చింది కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ. ఫిబ్రవరి 19న తమ ఆఫీసుకు రావాల్సిందిగా సమన్లు జారీ చేసింది. లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఇదిలా ఉండగా తాను బిజీగా ఉన్నానని, తనకు సమయం ఇవ్వాలని కోరారు మనీష్ సిసోడియా(Manish Sisodia CBI).
దీనిపై స్పందించిన సీబీఐ ఒప్పుకుంది. తాను ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించి ఈ ఏడాదికి సంబంధించి బడ్జెట్ తయారు చేసే పనిలో ఉన్నానని, తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రితో పాటు ఆర్థిక శాఖను కూడా మనీష్ సిసోడియా నిర్వహిస్తూ వస్తున్నారు.
బడ్జెట్ తయారీకి సంబంధించి పుల్ ఫోకస్ పెట్టాల్సి ఉందని అందుకే తాను సమయం ఇవ్వలేక పోతున్నానని చెప్పాడు. అందుకే తనకు మరికొంత సమయం ఇవ్వాలని కోరారు డిప్యూటీ సీఎం(Manish Sisodia CBI) . ఢిల్లీ మద్యం కుంభకోణం దేశంలో సంచలనం రేపింది. ఇప్పటికే 34 మందిపై కేసు నమోదు చేసింది.
ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 9 మందిని అరెస్ట్ చేసింది. ఇటీవల సీబీఐ కోర్టులో సమర్పించిన రెండో నివేదికలో సంచలన ఆరోపణలు చేసింది. వీరిలో ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత పేర్లు కూడా చేర్చింది. దీనిపై ఇద్దరూ ఖండించారు. ఇదంతా కేంద్రం కావాలని చేసిన ప్రయత్నం అని ఆరోపించారు.
Also Read : ఇక శివ సైనికులు ఊరుకోరు – ఠాక్రే