Manish Sisodia Called : మనీష్ సిసోడియాకు సీబీఐ పిలుపు
విచారణకు రావాలంటూ ఆదేశం
Manish Sisodia Called : కేంద్ర దర్యాప్తు సంస్థలు మరింత వేగం పెంచాయి కేంద్ర దర్యాప్తు సంస్థలు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి సీబీఐ, ఈడీ సోదాలు చేపట్టాయి. ఇప్పటికే 9 మందిని అదుపులోకి తీసుకుంది. సీబీఐ కోర్టుకు సమర్పించిన రెండో ఛార్జ్ షీట్ లో తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను చేర్చింది. ఇప్పటికే మద్యం ఎక్సైజ్ పాలసీలో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా నివాసంలో సోదాలు చేపట్టింది. ఆయనను కూడా చేర్చింది.
తాజాగా ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి విచారణకు హాజరు కావాల్సిందిగా సీబీఐ నోటీసు పంపింది. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన వ్యాపారులు విజయ్ నాయర్ , అభిషేక్ బోయిన్ పల్లి సహా ఏడుగురు నిందితులుగా ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాల్సిందిగా మనీష్ సిసోడియా ను(Manish Sisodia Called) పిలిచింది సీబీఐ. ఫిబ్రవరి 19న ఆదివారం విచారణకు రావాల్సిందిగా కోరింది. జారీ చేసిన నోటీసులో పేర్కొంది కేంద్ర దర్యాప్తు సంస్థ.
మద్యం వ్యాపారులకు లైసెన్సులు మంజూరు చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానానికి లంచం ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కొంత మంది డీలర్లకు మద్దతుగా డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా నిలిచారని సీబీఐ ఆరోపించింది. ఇదే విషయాన్ని సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది.
ఎక్సైజ్ పాలసీలో సవరణలు, లైసెన్సుదారులకు అనవసరమైన ప్రయోజనాలు కల్పించడం, లసెన్సు ఫీజులో మినహాయింపు తగ్గింపు , ఆమోదం లేకుండా ఎల్ -1 పొడిగింపు మొదలైన వాటితో సహా అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపించింది.
Also Read : వక్ఫ్ బోర్డు ఆస్తుల స్వాధీనం ఒప్పుకోం