CBI Raids Sisodia : సీబీఐ సోదాలలో దొరకని ఆధారాలు
పీఎం మోదీపై నిప్పులు చెరిగిన సిసోడియా
CBI Raids Sisodia : లిక్కర్ స్కాంకు సంబంధించి మనీ ల్యాండరింగ్ చోటు చేసుకుందన్న ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కేసు నమోదు చేసింది.
ఇందులో భాగంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో(Manish Sisodia) పాటు 14 మంది అధికారులపై అభియోగాలు మోపింది. 14 గంటలకు పైగా సిసోడియా ఇంట్లో సోదాలు చేపట్టారు.
ఎలాంటి ఆధారాలు దొరకలేదని పేర్కొన్నారు సోసిడియా. డిప్యూటీ సీఎం మొబైల్ , కంప్యూటర్లను సీజ్ చేసింది సీబీఐ. కేసు విచారణలో భాగంగా మంగళవారం మనీష్ సిసోడియాకు చెందిన బ్యాంక్ లాకర్లను తెరిచింది.
కాగా మద్యం పాలసీ కేసుకు సంబంధించి జరిగిన దాడుల్లో తన కుటుంబానికి క్లీన్ చిట్ లభించిందని , సీబీఐ తన ఇంట్లో జరిపిన దాడుల్లో ఏమీ కనుగొన లేదన్నారు డిప్యూటీ సీఎం.
ఘజియాబాద్ బ్యాంకు లోని లాకర్ ను కేంద్ర ఏజెన్సీ అధికారులు పరిశీలించారు. ఏమీ దొరకలేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మనీష్ సిసోడియా మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా ప్రధానిని టార్గెట్ చేశారు.
లాకర్ లో నా పిల్లలు, భార్యకు చెందిన సుమారు రూ. 70 వేల విలువైన ఆభరణాలు ఉన్నాయి. పీఎం నా ఇంటిని టార్గెట్ చేశారు. నా లాకర్ ను సోదా చేశారు. కానీ ఏమీ కనిపించక పోవడంతో నేను సంతోషంగా ఉన్నానని అన్నారు.
అన్ని దాడులు, సోదాలలో నా కుటుంబానికి క్లీన్ చిట్ లభించిందని పేర్కొన్నారు మనీష్ సిసోడియా(CBI Raids Sisodia). సోదాల సమయంలో సీబీఐ అధికారులు నా పట్ల మర్యాదగా ప్రవర్తించారని అన్నారు.
కాక పోతే ఏదో ఒకటి దొరక పట్టుకుని నన్ను జైల్లో పెట్టమని పీఎం ఆదేశించారని ఆరోపించారు.
Also Read : మోదీ పాలనలో పెరిగిన ఆత్మహత్యలు
#CBI searches Dy-CM's bank locker in relation to #LiquorScamProbe: Search of locker ends, Manish Sisodia claims nothing found in both raids and locker search- thanks officials for being polite and respectful.@aakaaanksha, @anchoramitaw and @priyanktripathi share details. pic.twitter.com/0EMN1r350u
— TIMES NOW (@TimesNow) August 30, 2022