Manish Sisodia : సక్సేనాపై మనీష్ సిసోడియా సీరియస్
పూర్తిగా రాజ్యాంగ విరుద్దమైన నిర్ణయం
Manish Sisodia : ఢిల్లీ ఆప్ సర్కార్ కు కోలుకోలేని షాక్ ఇచ్చారు లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అమలు చేస్తున్న విద్యుత్ పథకంపై దర్యాప్తునకు ఆదేశించారు ఎల్జీ. దీనిపై తీవ్రంగా స్పందంచారు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా(Manish Sisodia). ఇప్పటికే ఆయనపై మద్యం స్కాంలో కీలక పాత్ర పోషించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
తాజాగా ఎల్జీ ఆదేశాలపై భగ్గుమన్నారు డిప్యూటీ సీఎం. విద్యుత్ పంపిణీకి సంబంధించిన విద్యుత్ సబ్సిడీ పథకంలో జరిగిన అవకతవకలపై వీకే సక్సేనా విచారణకు ఆదేశించడం పూర్తిగా చట్ట విరుద్దమని స్పష్టం చేశారు. ఉచిత విద్యుత్ చొరవను నిలిపి వేసే లక్ష్యంతో ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు.
మంగళవారం మనీష్ సిసోడియా మీడియాతో మాట్లాడారు. ఈ మేరకు తాను లేఖ కూడా రాశానని చెప్పారు. దర్యాప్లులు, విచారణకు ఆదేశించడాలు కేవలం రాజకీయ ప్రేరేపితమైనవిగా పేర్కొన్నారు. అంతే కాదు రాజ్యాంగ విరుద్దమైనవని మండిపడ్డారు మనీష్ సిసోడియా(Manish Sisodia).
ఇదిలా ఉండగా విద్యుత్ పథకం పంపిణీపై విచారణ జరిపి వారం లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేష్ కుమార్ ను వినయ్ కుమార్ సక్సేనా ఆదేశించారు. దీనిపై నిప్పులు చెరిగారు ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.
ఇదిలా ఉండగా భూమి, పోలీసు , శాంతి భద్రతలు మినహా ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించిన ఏ విషయాలపైనా ఆదేశాలు జారీ చేసే అధికారం ఎల్జీకి లేదని సిసోడియా స్పష్టం చేశారు.
Also Read : ఆర్ఎస్ఎస్ కామెంట్స్ పై యాత్ర ఎఫెక్ట్