Manish Sisodia : ఆప్ లో నెంబర్ 2 మనీష్ సిసోడియా
ఒకప్పుడు జర్నలిస్ట్ నేడు అరెస్ట్
Manish Sisodia AAP : ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు మనీష్ సిసోడియా(Manish Sisodia). ఉన్న ప్రభుత్వ శాఖలలో అత్యధిక శాఖలు ఆయన చేతిలోనే ఉన్నాయి. 18 శాఖలకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
కానీ ఉన్నట్టుండి ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చివరకు సీబీఐ రంగంలోకి దిగడంతో ఆయన అరెస్ట్ కాక తప్పలేదు. ఒకప్పుడు జర్నలిస్ట్ గా , సోషల్ వర్కర్ గా ఆ తర్వాత పొలిటికల్ లీడర్ గా ఎదిగారు. తాను ఏ తప్పు చేయలేదని అంటున్నారు సిసోడియా. ఢిల్లీలో ఏర్పడిన ఆప్ ప్రభుత్వంలో మొట్ట మొదటి డిప్యూటీ సీఎంగా ఉన్నారు.
ఫిబ్రవరి 14, 2015లో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలోని పట్పర్ గంజ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు సిసోడియా. జనవరి 5, 1972లో పుట్టారు. వయస్సు 51 ఏళ్లు. ఆయన స్వస్థలం యూపీలోని హాపూర్ . డిప్లొమా ఇన్ జర్నలిజం చేశారు. అంతకు ముందు జర్నలిస్ట్ గా పని చేశారు. పట్పర్ గంజ్ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2013 నుంచి 2014 మధ్య ఢిల్లీలోని ఎన్సీటీ సర్కార్ లో మంత్రిగా ఉన్నారు.
2013లో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నిక కాక ముందు సిసోడియా సామాజిక కార్యకర్త, పాత్రికేయుడు. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు. ఆప్ వ్యవస్థాపక సభ్యుడు కూడా. సిసోడియా విద్యా మంత్రిగా నా ప్రయోగాలు అనే పుస్తకాన్ని కూడా రాశారు మనీష్ సిసోడియా(Manish Sisodia AAP) .
ఎన్నో ప్రశంసలు అందుకుంది. విద్యా పరంగా ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అలాగే వైద్య రంగంలో కూడా తనదైన ముద్ర కనబర్చారు. అంతకు ముందు రేడియో జాకీగా కూడా పని చేశారు. 1996లో ఆల్ ఇండియా రేడియోలో జీరో అవర్ పేరుతో హోస్ట్ చేశాడు.
Also Read : సిసోడియా అరెస్ట్ పై ఆప్ ఆందోళన