Manish Sisodia : ఆప్ నాయకుడు, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా(Manish Sisodia )సంచలన కామెంట్స్ చేశారు. హిమాచల్ ప్రదేశ్ లో కొత్త సీఎంగా అనురాగ్ ఠాకూర్ ను నియమించాలని బీజేపీ అనుకుంటోందంటూ బాంబు పేల్చారు.
ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుందని, రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీకి రోజు రోజుకు జనాదరణ పెరుగుతోందన్నారు. దీంతో భారతీయ జనతా పార్టీలో ఆందోళన మొదలైందన్నారు. మనీష్ సిసోడియా గురువారం మీడియాతో మాట్లాడారు.
ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు వస్తున్న జనాదరణ చూసి ఓర్వ లేక పోతోందన్నారు. ఇదిలా ఉండగా ఇవాళ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఆప్ ఆధ్వర్యంలో చేపట్టిన రోడ్ షోకు ఊహించని రీతిలో జనం హాజరయ్యారని తెలిపారు సిసోడియా.
ఆప్ వస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని హిమాచల్ ప్రదేశ్ లో సీఎం ను మార్చాలని అనుకుంటోందన్నారు. ఢిల్లీలో కేజ్రీవాల్ పాలన చూసి జనం హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఆప్ రావాలని కోరుకుంటున్నారని అర్థమై పోయిందన్నారు.
అందుకే ఎటూ పాలుపోక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ పార్టీ సీఎంను మార్చాలని అనుకుంటోందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పూర్తిగా విఫలమైన జై రామ్ ఠాకూర్ ప్రభుత్వం పట్ల రాష్ట్ర ప్రజలు పూర్తిగా నిరాశలో ఉన్నారని , అందుకే రాబోయే ఎన్నికల్లో చీపురుతో ఊడ్వడం ఖాయమన్నారు మనీష్ సిసోడియా. తాము పవర్ లోకి రావడం ఖాయమని జోస్యం(Manish Sisodia )చెప్పారు.
రాబోయే రోజుల్లో దేశంలో బీజేపీకి అసలైన ప్రత్యామ్నాయంగా ఆప్ ఎదగడం ఖాయమన్నారు సిసోడియా.
Also Read : ఆరోగ్యానికి భరోసా ఆయుష్మాన్ ఆసరా