Manish Sisodia Jail : తీహార్ జైలుకు మనీష్ సిసోడియా
ఢిల్లీ లిక్కర్ స్కాంలో నో బెయిల్
Manish Sisodia Jail : ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ సీఎం మనీష్ సిసోడియాకు కోలుకోలేని షాక్ తగిలింది. ఇప్పటికే 34 మందిపై అభియోగాలు మోపింది. కేసుకు సంబంధించి 10 మందిని అరెస్ట్ చేసింది. మద్యం పాలసీని మార్చడంలో కీలక పాత్ర పోషించాడని ఆరోపించింది. సీబీఐ అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పర్చింది. విచారణ సందర్బంగా మనీష్ సిసోడియా స్పందించడం లేదని కేంద్ర దర్యాప్తు సంస్థ ఆరోపించింది.
సోమవారం మరోసారి కోర్టులో హాజరు పర్చింది సిసోడియాను. దీంతో కోర్టు సంచలన ప్రకటన చేసింది. మద్యం పాలసీ కేసుకు సంబంధించి మనీష్ సిసోడియాను మార్చి 20 వరకు తీహార్ జైలుకు(Manish Sisodia Jail) పంపాలని ఆదేశించింది. ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు జైలుకు తరలించనున్నారు. ఇప్పటికే మనీ లాండరింగ్ కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్నారు సత్యేంద్ర జైన్. ఆయన అరెస్ట్ అయ్యేంత వరకు ఎలాంటి శాఖ లేకుండానే మంత్రిగా వ్యవహరించారు.
ఇవాల్టితో కస్టడీ ముగియడంతో ఈ మధ్యాహ్నం సిసోడియాను ప్రత్యేక కోర్టులో హాజరు పరిచారు. అరెస్ట్ అనంతరం సిసోడియాను ఐదు రోజుల పాటు సీబీఐ కస్టడీకి పంపింది.
శనివారం ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్ పాల్ కేంద్ర ఏజెన్సీకి మరో రెండు రోజుల కస్టడీని మంజూరు చేశారు. ఆప్ బెయిల్ ఇవ్వాలంటూ దరఖాస్తు చేసింది. సీబీఐ విచారణ సమయంలో సిసోడియా సహకరించడం లేదని ఆరోపించింది. కస్టడీకి ఇవ్వాలని కోరింది. చివరకు కోర్టు ఒప్పుకోలేదు. జైలుకు తరలించాలని ఆదేశించింది.
Also Read : బీజేపీ గెలుపులో హిమంత కీలక పాత్ర