Manneguda Kidnap : యువతి సేఫ్ నవీన్ రెడ్డి గ్యాంగ్ పై కేసు
రాష్ట్ర వ్యాప్తంగా కలకలం
Manneguda Kidnap : తెలంగాణలో బీహార్ కల్చర్ కొనసాగుతోంది. గతంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న ఘటనలు చాలా తక్కువ. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో యువతిని ఫక్తు సినిమా ఫక్కీలో దాడి చేయడం, ఆపై గ్యాంగ్ ఇష్టాను సారం ప్రవర్తించడం ఆపై కిడ్నాప్(Manneguda Kidnap) కు పాల్పడడం కలకలం రేపింది.
ఒక రకంగా ఫ్రెండ్లీ పోలీస్ నిద్ర పోయిందా అన్న అనుమానం వ్యక్తమైంది. బాధితురాలి పేరెంట్స్ బావురుమన్నారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించి యవతి తాను క్షేమంగా ఉన్నట్లు చెప్పడంతో ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా యువతిని రక్షించారు పోలీసులు. ఆమెను క్షేమంగా మన్నెగూడలోని ఆమె ఇంటికి తీసుకు వచ్చారు.
బాధితురాలి వాంగ్మూలం తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ వివరాలు బయటకు వచ్చాయి. యువతి తండ్రి దామోదర్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. షటిల్ బ్యాడ్మింటన్ ఆడుతుండగా తన కూతురుతో నవీన్ రెడ్డి పరిచయం పెంచుకున్నాడని తెలిపాడు ఫిర్యాదులో.
అప్పటి నుంచి ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలంటూ వేధింపులకు గురి చేస్తూ వచ్చాడని ఆరోపించాడు. శుక్రవారం ఉదయం నవీన్ రెడ్డి రూబెన్ అనే వ్యక్తితో పాటు మరో 50 మంది అనుచరులతో వోల్వో కారు ts07hx 2111, బొలేరో కారు ts 07u4141 తో పాటు మరికొన్ని కార్లలో వచ్చారని తెలిపారు.
తమపై , అడ్డుకోబోయిన కుటుంబీకులు, పక్క వారిపై దాడులకు తెగబడ్డారంటూ ఆరోపించారు. ఆ తర్వాత తన కూతురిని కిడ్నాప్ చేశాడని వాపోయాడు. ఇంట్లో ఉన్న సామాన్లతో పాటు సీసీ కెమెరాలను ధ్వంసం చేశారని ఆరోపించారు దామోదర్ రెడ్డి. ఇంటి వద్ద పార్క్ చేసిన కార్లను సైతం ధ్వంసం చేశారని వాపోయాడు . ఇందులో భాగంగా నవీన్ రెడ్డి అండ్ గ్యాంగ్ పై ఐపీసీ సెక్షన్ 147,148,307,324,363,427,506,452,380r/w 149 కింద కేసు నమోదు చేశారు.
Also Read : మాండూస్ బీభత్సం అతలాకుతలం