Manpreet Singh Badal : కాంగ్రెస్ కు గుడ్ బై బీజేపీకి బాదల్ జై
బీజేపీలో చేరిన మన్ ప్రీత్ సింగ్
Manpreet Singh Badal : కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, పంజాబ్ మాజీ ఆర్థిక మంత్రి మన్ ప్రీత్ సింగ్ బాదల్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన పార్టీని వీడిన కొన్ని గంటల తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరారు. మన్ ప్రీత్ సింగ్ బాదల్ తన రాజీనామా లేఖను రాహుల్ గాంధీకి రాశారు.
కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తు లేదన్నారు. కేవలం భ్రమలు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. విచిత్రం ఏమిటంటే రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం పంజాబ్ లో కొనసాగుతోంది. ఈనెల 31న జమ్మూ కాశ్మీర్ లో ముగింపు సభ జరగనుంది. ఇప్పటి దాకా తనకు ఓ నమ్మకం ఉండేదని కానీ కాంగ్రెస్ పార్టీలో ఆ నమ్మకం లేకుండా పోయిందన్నారు.
ప్రస్తుతం పార్టీకి దిశా నిర్దేశం అంటూ ఏదీ లేదన్నారు. ఈ తరుణంలో తన రాజకీయ భవిష్యత్తుకు సార్థకత కేవలం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుందని తనకు నమ్మకం ఏర్పడిందని చెప్పారు మన్ ప్రీత్ సింగ్ బాదల్(Manpreet Singh Badal) . బుధవారం దేశ రాజధాని ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర వ్యాపార, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో పాటు పలువురు సీనియర్ నాయకుల సమక్షంలో మన్ ప్రీత్ సింగ్ బాదల్ కాషాయ జెండా కప్పుకున్నారు.
బాదల్ చేరడం వల్ల పార్టీకి మరింత బలం చేకూరినట్లయిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మన్ ప్రీత్ సింగ్ బాదల్ కీలక వ్యాఖ్యలు చేశారు ట్విట్టర్ లో. పార్టీలో, ప్రభుత్వంలో తాను న్యాయం చేశానని పేర్కొన్నారు. ఇదే సమయంలో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.
Also Read : మోడీపై యుద్దానికి సిద్దం – సీఎం మాన్