Mansukh Mandaviya : కరోనా కలకలం జర భద్రం
ఒక్క రోజే పెరిగిన 6 వేల కేసులు
Mansukh Mandaviya : దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఒక్క రోజే 6,000 కరోనా కేసులు నమోదు కావడంతో కేంద్ర సర్కార్ అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ(Mansukh Mandaviya) శుక్రవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కేంద్రం అన్ని రకాలుగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి.
ఈ అత్యవసర సమావేశానికి ఆయా రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు , కార్యదర్శులు పాల్గొన్నాయి. కోవిడ్ 19పై కేంద్రం ఎప్పటికప్పుడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలను జారీ చేస్తుంది. దీనిపై ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాలతో సమీక్ష చేపట్టారు. ఆరోగ్య శాఖ మంత్రి కూడా సమీక్షా చేపట్టారని ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ వెల్లడించారు.
కాగా శుక్రవారం 6,050 కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటి 5,335 ఇన్ఫెక్షన్ల కంటే 13 శాతం ఎక్కువ. మొత్తం యాక్టివ్ కేసులు 28,303 వద్ద ఉండగా అదే సమయంలో వైరస్ కారణంగా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా కారణంగా ఇప్పటి వరకు 5,30,943 మంది మృతి చెందారు. డిశ్చార్జి అయిన వారి సంఖ్య 4,41,85,858 గా ఉంది. 2021న దేశ వ్యాప్తంగా ప్రారంభించిన టీకాల ప్రకారం 2,20,66,20,700 టీకాలు వేసినట్లు కేంద్రం తెలిపింది.
Also Read : జేడీఎస్ చీఫ్ తో ఓవైసీ చర్చలు