Mansukh Mandaviya : కరోనా గురించి చెప్పడం నా బాధ్యత
స్పష్టం చేసిన ఆరోగ్య మంత్రి మన్సుఖ్
Mansukh Mandaviya : తాను రాహుల్ గాంధీ, సీఎం అశోక్ గెహ్లాట్ కు లేఖలు రాయడం రాజకీయంగా దుమారం రేగడంపై తీవ్రంగా స్పందించారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ(Mansukh Mandaviya) . ప్రతి ఒక్కరు కోవిడ్ రూల్స్ పాటించాలని, భౌతిక దూరం ఉండాలని , మాస్క్ ధరించాలని లేక పోతే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఇదే సమయంలో ఇద్దరికి రాసిన లేఖలో కరోనా రూల్స్ పాటించక పోతే భారత్ జోడో యాత్రను నిలిపి వేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు రాహుల్ గాంధీకి. దీనిపై కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా స్పందించింది. ఆ పార్టీకి చెందిన ఎంపీలు అధీర్ రంజన్ చౌదరి, జైరాం రమేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్రం కావాలని తమపై బురద చల్లేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. యాత్రను కావాలని అడ్డుకునేందుకు ఇలాంటి ఎత్తుగడ వేశారంటూ మండిపడ్డారు. రాహుల్ గాంధీ చేపట్టిన యాత్రకు దేశంలో పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోందని అందుకే తట్టుకోలేకే ఇలాంటి ఎత్తుగడ వేశారంటూ ఆరోగ్య మంత్రిపై మండిపడ్డారు.
దీనిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మన్సుఖ్ మాండవీయ(Mansukh Mandaviya) . తాను కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన మంత్రినని పేర్కొన్నారు. దేశానికి ముఖ్యంగా అన్ని పార్టీలకు చెందిన వారికి తెలియ చెప్పడం, కరోనా గురించి హెచ్చరించడం తన బాధ్యత అని స్పష్టం చేశారు. దీనిని కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయాలని అనుకోవడం దారుణమన్నారు.
కోవిడ్ 19 ప్రోటోకాల్ ను అనుసరించాలని కోరుతూ తాను రాసిన లేఖలు రాజకీయం చేయాలని కాదని గుర్తు పెట్టు కోవాలంటూ స్పష్టం చేశారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి.
Also Read : కరోనా భూతం మాస్క్ లు అవసరం