Margadarshi Chit Case : మార్గ‌ద‌ర్శి ఎండీ జంప్ – సీఐడీ

త‌ప్పించు కునేందుకే విదేశాలకు

Margadarshi Chit Case : హైద‌రాబాద్ – నిన్న‌టి దాకా అన్నింటా ఆధిప‌త్యం చెలాయిస్తూ వ‌చ్చిన మార్గ‌ద‌ర్శి చిట్ ఫండ్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ శైల‌జా కిర‌ణ్ , ఈనాడు సంస్థ‌ల చైర్మ‌న్ రామోజీ రావు కు ఇప్పుడు కాలం క‌లిసి రావ‌డం లేదు. రాజ గురువుగా భావించే ఆయ‌న ప‌రిస్థితి రెంటికి చెడ్డ రేవ‌డిలా మారింది.

Margadarshi Chit Case Raised by CID

మార్గ‌ద‌ర్శి కేసు బ‌లంగా మెడ‌కు చుట్టుకునేలా ఉంది. ప్ర‌స్తుతం కేసు న‌డుస్తోంది. దీనిని ఏపీ సీఐడీ ద‌ర్యాప్తు చేస్తోంది. ఇప్ప‌టికే ప‌లుమార్లు నోటీసులు కూడా జారీ చేసింది. కానీ శైల‌జా కిర‌ణ్, రామోజీ రావు(Ramoji Rao) కావాల‌ని దాట‌వేస్తూ వ‌చ్చార‌ని ఆరోపించింది సీఐడీ.

ప‌నిగ‌ట్టుకుని ఇలాంటి ప్లాన్ చేస్తున్నార‌ని పేర్కొంది. విచార‌ణకు వెళ్లిన స‌మ‌యంలో తన ఆరోగ్యం బాగో లేదంటూ మంచంపై ఉన్న‌ట్లు ఫోటోలు షేర్ చేశారు. దానిపై పెద్ద ఎత్తున సెటైర్లు కూడా ఎక్కువ‌గా వ‌చ్చాయి.

ప‌త్రిక‌, మీడియాను అడ్డం పెట్టుకుని నానా ర‌కాలుగా వ్యాపారాలు చేస్తూ అడ్డ‌గోలుగా వ‌సూలు చేసిన మార్గ‌ద‌ర్శిపై లెక్క తేల్చాలంటూ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ కేసు వేశారు. తాజాగా మార్గ‌ద‌ర్శి ఎండీగా ఉన్న శైల‌జా కిర‌ణ్ విచార‌ణ నుంచి త‌ప్పించు కునేందుకు ముంద‌స్తు స‌మాచారం ఇవ్వ‌కుండా దేశం విడిచి వెళ్లారంటూ ఆరోపించింది ఏపీ సీఐడీ.

ఈ మేర‌కు తెలంగాణ హైకోర్టులో కౌంట‌ర్ దాఖ‌లు చేసింది. ఏ1గా రామోజీరావు, ఏ2గా శైల‌జా కిర‌ణ్ లుగా పేర్కొంది. వారు విచార‌ణ‌కు స‌హ‌క‌రించ‌డం లేదని ఆరోపించింది . ఈ విష‌యాన్ని ఏపీ సీఐడీ కోర్టుకు తెలిపింది.

Also Read : P Chidambaram : మోదీ వ‌ల్ల‌నే చైనా చొర‌బాటు

Leave A Reply

Your Email Id will not be published!