Margaret Alva : ఓటు వేయండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి
ఉప రాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వా
Margaret Alva : ఎలాంటి భయానికి లోనుకాకుండా తమ విలువైన ఓటును ఈ దేశం కోసం, ప్రజల కోసం ఓటు వేయాలని ప్రజా ప్రతినిధులకు విన్నవించారు విపక్షాల ఉమ్మడి ఉప రాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వా(Margaret Alva).
గురువారం ఆమె వీడియో ద్వారా సందేశాన్ని అందించారు. ప్రస్తుతం ఎవరూ ప్రశాంతంగా ఓటు వేసే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వానికి తల వంచితే గనుక ఈ దేశం ఇబ్బందుల్లో పడుతుందని హెచ్చరించారు. ఓటు అన్నది అత్యంత విలువైనదని, దానిని ఎట్టి పరిస్థితుల్లో మంచి వాటికే వాడాలని సూచించారు.
ఓటు ఎందరినో మారుస్తుంది. వారి తలరాతల్ని. ఇవాళ ప్రపంచంలోనే అత్యున్నత ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచిన ఈ దేశంలో గతంలో ఉన్నట్టుగా ఇప్పుడు లేదన్నారు.
ప్రస్తుతం ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. ప్రజా ప్రతినిధులకు ఒక్కటే విన్నపం. మీరు ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి.
భారత రాజ్యాంగం పట్ల నమ్మకం, ప్రజాస్వామ్యం పట్ల అచెంచల విశ్వాసం ఉన్న వ్యక్తులు ఎవరో గుర్తించండి. ఆ మేరకు వారికే ఓటు వేయాలని మార్గరెట్ అల్వా కోరారు.
మీరు వేసే ఓటు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నారు. ఇదిలా ఉండగా విపక్షాల తరపున అల్వా పోటీ చేస్తుండగా బీజేపీ సంకీర్ణ సర్కార్ (ఎన్డీఏ) తరపు నుంచి జగదీప్ ధన్ ఖర్ బరిలో ఉన్నారు ఉప రాష్ట్రపతిగా.
గత 50 ఏళ్లలో ఎన్నో పదవులు నిర్వహించాను. వాటికి న్యాయం చేశానని చెప్పారు ఆమె.
Also Read : పార్థ..అర్పితకు చెందిన ఫ్లాట్ లో సోదాలు