Mark Zuckerberg : మెటా వర్స్ పై తగ్గేదే లే – జుకర్ బర్గ్
భారీగా తగ్గిన ఫేస్ బుక్ లాభాలు
Mark Zuckerberg : ప్రపంచ వ్యాప్తంగా ఫేస్ బుక్ కు ఉన్నంత క్రేజ్ ఇంకే దానికి లేదంటే నమ్మలేం. అంతలా పాపులర్ అయ్యింది. కానీ ఎందుకనో దానిని మెటా వర్స్ గా మార్చాక పనితీరు ఆశాజనకంగా ఉండడం లేదు. ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు జుకెర్ బర్గ్(Mark Zuckerberg) తన కలల ప్రపంచంగా ఇప్పటికీ ఎప్పటికీ పేర్కొనేది ఒక్కటే ఫేస్ బుక్.
ఇవాళ అత్యధిక యూజర్లలో ఎక్కువ శాతం ఇతర మాధ్యమాల కంటే ఫేస్ బుక్ లోనే ఉన్నారనేది వాస్తవం. దీనిని గమనించిన ఫౌండర్ జుకర్ బర్గ్ తెలివిగా మరికొన్నింటిని తీసుకు వచ్చాడు. అందులో ఎక్కువగా ప్రాబల్యం పొందినవి ఇన్ స్టా గ్రామ్ , వాట్సాప్ . ఫేస్ బుక్ తో ఈ రెండింటిని కూడా అత్యధికంగా ప్రతి రోజూ వినియోగిస్తున్నారు.
తమను తాము ఆవిష్కరించు కుంటున్నారు. ఇప్పటికే రష్యాకు చెందిన టెలిగ్రామ్ వాట్సాప్ కు చుక్కలు చూపిస్తోంది. మార్కెట్ పరంగా మరింత వాటాను పెంచుకుంటూ పోతోంది. ఇటీవలే వాట్సాప్ కు సాంకేతిక అంతరాయం కలగడం కొంత అనుమానాలకు తావిస్తంది.
ఈ సమయంలో వెల్లడైన ఫలితాలు తీవ్ర నిరాశకు గురి చేశాయని చెప్పక తప్పదు. దాదాపు మెటా వర్స్ (ఫేస్ బుక్ – ఇన్ స్టా గ్రామ్ – వాట్సాప్ ) లాభాలు 50 శాతంకు పైగా క్షీణించాయి. ఇదే రీతిన నాలుగో రౌండ్ ఫలితాల్లో కూడా ప్రభావం చూపే అవకాశం ఎక్కువగా ఉంటుందని మార్కెట్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.
భారీ ఎత్తున ఈ సంస్థలకు ప్రకటనలు తగ్గి పోయాయి. విచిత్రం ఏమిటంటే మార్క్ జుకర్ బర్గ్ కు ఉన్న ఫాలోయర్ల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుముఖం పట్టడం విస్తు పోయేలా చేసింది.
Also Read : సిఇఓ పరాగ్ అగర్వాల్ పై మస్క్ వేటు