Marri Janardhan Reddy : నేను తల్చుకుంటే కాల్చి పారేస్తా – మర్రి
బీఆర్ఎస్ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి
Marri Janardhan Reddy : నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సోమవారం భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్బంగా మర్రి జనార్దన్ రెడ్డి ప్రసంగించారు. నా తోటికి వస్తే తోలు తీస్తానన్నారు. నా క్యాడర్ కు చెపితే ఒక్కరూ కూడా తిరగ లేరని హెచ్చరించారు.
Marri Janardhan Reddy Shocking Comments
నేను గనుక తల్చుకుంటే కాంగ్రెసోళ్లను కాల్చి పారేస్తానని అన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యే(Marri Janardhan Reddy) చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. నాతో పెట్టుకుంటే మీరంతా మైనస్ అంటూ మండిపడ్డారు. సిగ్గు, దమ్ము, ధైర్యం అంటే నాగర్ కర్నూల్ లో తిరగాలని సవాల్ విసిరారు.
నాతో పెట్టుకుని నిలబడ గలిగే వాళ్లు ఎవరూ లేరన్నారు. ప్రస్తుతం నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కలకలం రేపాయి. కేవలం ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం ఒకింత ఆశ్చర్యానికి గురయ్యేలా చేసింది.
ఫస్ట్రేషన్ తో అన్నారా లేక డబ్బు, అధికార గర్వంతో అలా అన్నారా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మాటల ధోరణి మరింత ఎబ్బెట్టుగా ఉంటున్నాయి. ఇటీవలే ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేలను కుక్కలతో పోల్చాడు. ఈయన ఏకంగా కాల్చి పారేస్తానంటూ కామెంట్ చేయడం కలకలం రేపింది.
Also Read : Minister KTR : డిక్లరేషన్ సభ కాదు ఫ్రస్టేషన్ సభ