Marri Shashidhar Reddy : బీజేపీలో చేరిన మర్రి శశిధర్ రెడ్డి
టీఆర్ఎస్ పని ఖతం బీజేపీనే ప్రత్యామ్నాయం
Marri Shashidhar Reddy : కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన సీనియర్ నాయకుడు , మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి తనయుడు మర్రి శశిధర్ రెడ్డి కాషాయ కండువా కప్పుకున్నారు. ఢిల్లీలో శుక్రవారం ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సంద్భంగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు, చోటు చేసుకుంటున్న పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో రాచరిక పాలన సాగుతోందని, దానికి ప్రత్యామ్నాయం ఒక్క బీజపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. అంతకు ముందు మర్రి శశి ధర్ రెడ్డిని కేంద్ర మంత్రి శర్వానంద్ సోనోవాల్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలపై మండిపడ్డారు.
ఆపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, గతంలో పీసీసీగా పని చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డిలపై నిప్పులు చెరిగారు. వీరి నిర్వాకం వల్లనే పార్టీ భ్రష్టు పట్టి పోయిందని ఆరోపించారు. ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ లేదన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఆ పార్టీకి క్యాన్సర్ సోకిందన్నారు.
దానిని బాగు చేసేందుకు ఎవరి తరం కాదన్నారు. మెరుగైన డాక్టర్ లేడన్నారు. అంతులేని అవినీతికి కాంగ్రెస్ పార్టీ కేరాఫ్ గా మారి పోయిందని ధ్వజమెత్తారు మర్రి శశి ధర్ రెడ్డి(Marri Shashidhar Reddy). రాష్ట్రంలో త్వరలో జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పవర్ లోకి రావడం ఖాయమన్నారు.
ఆక్టోపస్ లా అల్లుకు పోయిన గులాబీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ కు లేదని, ఒక్క బీజేపీకి మాత్రమే ఉందన్నారు.
Also Read : మల్లన్నతో పాటు డైరెక్టర్లకు నోటీసులు