Masks No Longer : విమాన జ‌ర్నీలో మాస్క్ త‌ప్స‌నిస‌రి కాదు

స్ప‌ష్టం చేసిన కేంద్ర ప్ర‌భుత్వం

Masks No Longer : క‌రోనా క‌ష్ట కాలంలో ప్ర‌తి ఒక్క‌రు మాస్క్ ధ‌రించాల‌ని ఇప్ప‌టికే కేంద్ర స‌ర్కార్ ఆదేశాలు జారీ చేసింది. రెండేళ్లు గ‌డిచినా ఇంకా అక్క‌డ‌క్క‌డా క‌రోనా ప్ర‌భావం క‌నిపిస్తోంది. ఇదే స‌మ‌యంలో విమాన ప్రయాణం చేసే ప్ర‌యాణికులు విధిగా మాస్క్ ధ‌రించాల‌ని స్ప‌ష్టం చేసింది.

ఆదేశాలు పాటించ‌క పోతే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించింది. ఇదే స‌మ‌యంలో ఢిల్లీ హైకోర్టు కూడా సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చింది. కేంద్ర పౌర‌, విమానయాన శాఖ సైతం ఆదేశాలు జారీ చేసింది. తాజాగా క‌రోనా ఆశించిన స్థాయిలో త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో ఇక నుంచి విమాన ప్ర‌యాణం సంద‌ర్భంగా మాస్క‌ల్(Masks No Longer)  ధ‌రించ‌డం అన్న‌ది త‌ప్ప‌నిస‌రి కాద‌ని ప్ర‌క‌టించింది.

ఈ మేర‌కు బుధ‌వారం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది స‌ర్కార్. ఇదిలా ఉండ‌గా ప్ర‌భుత్వం షెడ్యూల్ చేయ‌బ‌డిన ఎయిర్ లైన్స్ కు క‌మ్యూనికేష‌న్ లో కోవిడ్ -19 నిర్వ‌హ‌ణ ప్ర‌తిస్పంద‌న‌కు గ్రేడెడ్ విధానానికి అనుగుణంగా తాజా నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు కేంద్ర విమాన‌యాన మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది.

కాగా క‌రోనా తగ్గుముఖం ప‌ట్టినా ప్ర‌యాణికులు మాస్క్ లు ధ‌రిస్తే ఆరోగ్య ప‌రంగా మేలు జ‌రుగుతుంద‌ని సూచించింది. ఇప్ప‌టి వ‌ర‌కు విమానాల్లో ప్ర‌యాణించేట‌ప్పుడు మాస్కులు లేదా ఫేస్ క‌వ‌ర్లు ఉప‌యోగించ‌డం త‌ప్ప‌నిస‌రి చేసింది. మాస్క్ లు ధ‌రించ‌క పోతే విమానాల్లో ఎంట్రీ ఇవ్వ కూడ‌ద‌ని కూడా ఆదేశాలు జారీ చేసింది.

విమాన ప్ర‌క‌ట‌న‌లో భాగంగా జ‌రిమానా లేదా శిక్ష ప‌డే చ‌ర్య‌ల‌కు సంబంధించిన ఏదైనా నిర్దిష్ట సూచ‌న‌ను ప్ర‌క‌టించాల్సిన అవ‌స‌రం లేద‌ని కూడా పేర్కొంది కేంద్ర పౌర విమాన‌యాన శాఖ‌.

Also Read : భారతీయుల‌కు రిషి సున‌క్ ఖుష్ క‌బ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!