Tencent Shock : టెన్సెంట్ లో భారీగా ఉద్యోగాలలో కోత
5,500 వేల మందికి పైగా తొలగింపు
Tencent Shock : కరోనా తర్వాత ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు అంతగా కలిసి రావడం లేదు. ఉద్యోగులు ఎక్కువ మంది ఇంటి వద్ద నుండి పని చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఇక టెక్నాలజీ, వినోదం, లాజిస్టిక్ తదితర రంగాలకు చెందిన కంపెనీలు ఇప్పుడు మందగమనంలో సాగుతున్నాయి. విచిత్రం ఏమిటంటే నిన్నటి దాకా టాప్ లో ఉన్న గూగుల్, ఆపిల్ లాంటి కంపెనీలు సైతం ఉద్యోగులకు చెక్ పెట్టే పనిలో ఉన్నాయి.
ఇప్పటికే స్ట్రాంగ్ బెల్ కూడా కొట్టారు సిఇఓ సుందర్ పిచాయ్. ఇక ఆపిల్ ఏకంగా ఉద్యోగులను నియమించుకునే కాంట్రాక్టర్ ఏజెన్సీలను తీసి పారేసింది. దీనికి ప్రధాన కారణం త్రైమాసిక ఫలితాలు అంతగా ఆశించినంతగా లేక పోవడమే.
తాజాగా మరో షాకింగ్ న్యూస్ చెప్పింది ప్రముఖ దిగ్గజ టెక్నాలజీ, వినోద రంగానికి చెందిన టెన్సెంట్(Tencent Shock) . గత పది సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు తమ సంస్థలో పనిచేస్తున్న 5,500 వేల మందిపై వేటు వేసింది. ఈ ఆకస్మిక నిర్ణయంతో జాబర్స్ ఖంగు తిన్నారు. ఆయా రంగాలు ఒక్కసారిగా కుదుపునకు లోనయ్యాయి.
ఇక ఇప్పటి వరకు ఈ కంపెనీలో లక్షకు పైగా వివిధ స్థాయిలలో పని చేస్తున్నారు. ఒక వేళ రాను రాను ఆశించిన మేరకు రిజల్ట్స్ రాక పోతే ఇతర కంపెనీలు కూడా ఇదే బాట పట్టనున్నాయి. సేమ్ సీన్ రిపీట్ కానుందన్నమాట.
కాగా వివిధ కంపెనీలలో పని చేస్తున్న ఉద్యోగులంతా బిక్కు బిక్కు మంటున్నారు.
Also Read : సూపర్ ఫీచర్స్ తో ఆల్టో కె-10 మోడల్