#Darshakudu : సినీవాలిలో విరిసిన కుసుమం – ద‌ర్శ‌కుడు

జీవితాన్ని ఆవిష్క‌రించాలంటే ద‌మ్ముండాలి. అంతేనా కాస్తంత..తిక్క‌..పొగ‌రు..పిచ్చి..ఆవేశం..కోపం..ఆతృత‌..వేగం..లేత‌త‌నం..స్పందించే హృద‌యం వుంటే చాలు..ద‌ర్శ‌కులై పోవ‌చ్చు.

జీవితాన్ని ఆవిష్క‌రించాలంటే ద‌మ్ముండాలి. అంతేనా కాస్తంత..తిక్క‌..పొగ‌రు..పిచ్చి..ఆవేశం..కోపం..ఆతృత‌..వేగం..లేత‌త‌నం..స్పందించే హృద‌యం వుంటే చాలు..ద‌ర్శ‌కులై పోవ‌చ్చు. సినిమా అన్న‌ది ఓ క‌ల‌. అది పిచ్చెక్కిస్తుంది..మైమ‌రిచి పోయేలా మ్యాజిక్ చేస్తుంది. ఎంత అందంగా ఉన్నామ‌న్న‌ది కాదు ముఖ్యం ఎలా చెప్ప‌గ‌లిగామ‌న్న‌దే కావాల్సింది. ప్ర‌పంచ‌పు కాన్వాస్ ను ఆవిష్క‌రించాలంటే ఏ ఫార్మాట్‌లోనూ కొల‌వ‌లేం. దానిని.. అందంగా..శ్రావ్యంగా..అద్భుతంగా..అద్వితీయంగా..అమోఘంగా..రేయింబ‌వ‌ళ్లు వెంటాడేలా చేయాలంటే ఒకే ఒక్క‌టి..అదే ఫిలిం. బ‌తుకును ఉన్న‌ది ఉన్న‌ట్లుగా చెప్పాలంటే స‌మ‌యం చాల‌దు..జీవితం స‌రిపోదు. కానీ సినిమా అలా కాదు అన్ని క‌ళ‌ల‌కు స్వ‌ర్గధామం. లోకంలో ఉన్న ప్ర‌తి ప్రాణికి బ‌త‌కాల‌న్న ఆశ వుండే ఉంటుంది..అది కాస్తా కోర్కెగా మారి మ‌రింత ప‌దును దేరేలా చేస్తుంది ఈ రంగం. ప్ర‌పంచ వ్యాప్తంగా సినిమా వెలుగుతోంది. ఒక్కొక్క‌రిది ఒక్కో స్టైల్. ఇత‌ర ప్రాంతాల‌లో అయితే డైరెక్ట‌ర్లదే రాజ్యం. వారే సుప్రీం. వాళ్లే క‌ల‌లకు రెక్క‌లు తొడిగి రెప రెప‌లాడేలా చేసేది. కానీ మ‌న ఇండియాలో మాత్రం ఇంకా పాత వాస‌న‌లు పోలేదు. టెక్నాల‌జీ మార‌డం..కొత్త వాళ్ల‌కు ఎక్క‌డ‌లేని ఛాన్సులు రావ‌డంతో కొన్నేళ్లుగా..కొన్ని త‌రాల నుంచి పాతి పెట్టుకుని..ఆధిప‌త్యం చెలాయిస్తూ ఊరేగుతున్న వాళ్ల‌కు సోష‌ల్ ..డిజిట‌ల్ మీడియాలు చెక్ పెట్టాయి. ఎంత టాలెంట్ ఖ‌ర్చు చేసి..నానా తిప్ప‌లు ప‌డి..బుర్ర బ‌ద్ద‌ల‌య్యేలా ఆలోచించి ..సినిమాకు ప్రాణం పోసి..స‌క్సెస్ చేస్తే..ఉన్న పేరు కాస్తా డైరెక్ట‌ర్ కాకుండా హీరోకు వెళ్లేది..తమిళ‌, క‌న్న‌డ‌, తెలుగు, హిందీ సినిమాల‌లో ఈ జాడ్యం మితిమీరి పోయింది.
ఎందాకా అంటే వాళ్లే ద‌ర్శ‌కుల‌య్యేంత దాకా..గెలుపు రానంత వ‌ర‌కు ఓకే ..వ‌చ్చాక వాళ్ల‌దే ఇష్టారాజ్యం. ఇక మ‌ళ‌యాలం, ఒడిస్సా, బెంగాళీ, త‌దిత‌ర ప్రాంతాల్లో మాత్రం డైరెక్ట‌ర్ల‌కే ఫ‌స్ట్ ప్ర‌యారిటీ. ఒక సినిమా తీయాలంటే అభిరుచి క‌లిగిన నిర్మాత ఉండాలి. ఇపుడు అంత‌టా కార్పొరేట్ల హ‌వా న‌డుస్తోంది. అయినా తెలుగు నాట కొత్తద‌నం వెల్లి విరుస్తోంది. గ‌తంలో ఉన్న హీరో ఫార్మాట్ క‌థ‌లు కాకుండా క‌థే డామినేట్ చేసే సినిమాలు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. రైట‌ర్లు, లిరిసిస్టులు, సంగీత ద‌ర్శ‌కులు, కొరియోగ్రాఫ‌ర్లు, వీడియో ఎడిట‌ర్లు, గ్రాఫిక్ డిజైన‌ర్లు, ప‌బ్లిసిటీ ఇంఛార్జీలతో పాటు 24 క‌ళ‌ల‌కు సంబంధించిన నిపుణులు కొన్ని నెల‌లు, ఏళ్లు నిద్ర‌లేని రాత్రుల‌కు దూర‌మై క‌ష్ట‌ప‌డితే ఓ మూవీ విడుద‌ల‌వుతుంది. థియేట‌ర్లు, ఓటీటీ ఫార్మాట్‌లు వ‌చ్చాక కొంత అనారోగ్య‌క‌ర‌మైన పోటీ త‌గ్గింది.

ఒక్క ఫిలిం ఒక్కో ద‌ర్శ‌కుడిని ఎవ‌రెస్ట్ శిఖ‌రం మీద నుల్చో బెడితే..ఇంకో సినిమా ఫ్లాప్ అయితే అధ పాతాళానికి తొక్కేస్తుంది. కొంద‌రు ఫేట్ ను న‌మ్ముకుంటారు..ఇంకొంద‌రు త‌మ టాలెంట్ ను విశ్వ‌సిస్తారు. మ‌రికొంద‌రు కంటెంట్ ను న‌మ్ముకుని త‌మ దారిన తాము వెళుతుంటారు. 21వ శ‌తాబ్ధం అంతా క‌ళాకారుల‌దే..త‌మ మీద త‌మ‌కు న‌మ్మ‌కం ఉన్న క్రియేటివిటీ క‌లిగిన వారికే సినిమా ప‌రిశ్ర‌మ తివాచీ ప‌రుస్తోంది. ఇక తెలుగు నాట యూట్యూబ్ క‌ల‌ల బేహారుల‌కు వేదిక‌గా నిలుస్తోంది. వెన్ను ద‌న్నుగా ఉంటోంది. లెక్చ‌ర‌ర్ గా ప‌నిచేస్తూ స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ గా వినుతికెక్కిన సుకుమార్ తోడ్పాటుతో వ‌చ్చిన ద‌ర్శ‌కుడు క‌మ‌ర్షియ‌ల్ గా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. సినిమా రంగంలోకి రావాల‌నుకునే వాళ్లు..ద‌ర్శ‌కులుగా విజ‌యం సాధించాల‌నుకునే వాళ్లు..హీరో హీరోయిన్లు..క‌ళాకారులు..సాంకేతిక నిపుణుల‌కు ఈ సినిమా ఓ గైడ్ గా ఉప‌క‌రిస్తుంది. ప్ర‌తి ఒక్క‌రిని ఆలోచింప చేస్తుంది.
గ‌తంలో ఇలాంటి క‌థాంశంతో ఎన్నో సినిమాలు వ‌చ్చి ఉండ‌వ‌చ్చు..కానీ ఈ ద‌ర్శ‌కుడు మూవీ మాత్రం వెరీ వెరీ డిఫ‌రెంట్. ఇక్క‌డ టాలెంట్ ను ఎలా వాడుకోవాలో..క‌థ‌ను ఎలా చెప్పాలో..ఎలా ప్రేక్ష‌కుల‌ను ఒప్పించి..మెప్పించాలో..డైరెక్ట‌ర్ పూర్తిగా స‌క్సెస్ అయ్యాడ‌నే చెప్పాలి. సుకుమార్ ఈ సినిమాకు నిర్మాత‌. కొత్త‌గా హ‌రిప్ర‌సాద్ జ‌క్కాకు అవ‌కాశం ఇచ్చాడు. దీనిని మ‌నోడు మిస్ కాలేదు..త‌నని తాను ప్రూవ్ చేసుకున్నాడు. ద‌ర్శ‌కుడిగా ఫుల్ మార్కులు కొట్టేశాడు. ఈ మూవీలో మూడు పాత్ర‌లు ప్ర‌ధాన పాత్ర పోషిస్తాయి. ఒక హీరో..ఇద్ద‌రు హీరోయిన్లు..వీరు ద‌ర్శ‌కుడి అంచ‌నాల‌కు మించి న‌టించారు. ఆ పాత్ర‌ల్లో లీన‌మ‌య్యారు..వంద శాతం న్యాయం చేశారు. అశోక్..ఇషా..పూజిత స్టార్ హీరో, హీరోయిన్ల‌తో స‌రిస‌మానంగా పండించారు. ముగ్గురూ ముగ్గురే ఎవ‌రికి వారే పోటీ ప‌డ్డారు. సినిమాకు మ‌రింత జోష్ తీసుకు వ‌చ్చారు. అంతేనా ఇషా అయితే హీరో ను ఒక సంద‌ర్భంలో డామినేట్ చేసింది. డైలాగులు మ‌న‌సుకు హ‌త్తుకునేలా వున్నాయి.
డైరెక్ట‌ర్ కావాల‌ని నిత్యం ప‌రిత‌పించే సీన్ల‌లో అశోక్ మెప్పించాడు. ప్రేమ‌కు..వృత్తి ప‌ర‌మైన ద‌ర్శ‌క‌త్వం మ‌ధ్య న‌లిగి పోయే పాత్ర ఎప్ప‌టికీ గుర్తుండి పోతుంది. ల‌వ్ లో ప‌డితే ఏం జ‌రుగుతుంద‌నేదే ఈ సినిమా ప్ర‌ధాన ఇతివృత్తం. ఇది పూర్తిగా సినిమా పిచ్చోడి స్టోరీ. ప‌డుకున్నా..లేచినా ..న‌డిచినా..ఆలోచించినా అంతా సినిమా గురించే త‌పన‌. ఎక్క‌డైనా పేరెంట్స్ పిల్ల‌లు స్థిర‌ప‌డాల‌ని..ఉద్యోగాలు చేయాల‌ని అనుకుంటారు..కానీ ఈ మూవీలో మాత్రం తండ్రి హీరోకు ఫుల్ స‌పోర్ట్. పిల్ల‌గాలి తెమ్మెర‌లా తాకే స‌న్నివేశాలు..లేలేత సొగసును ఆపాదించుకున్న పాత్ర‌లు గుండెల్ని క‌ట్టి ప‌డేస్తాయి. మంద్ర స్వ‌రంలా మైమ‌రిచి పోయేలా చేసే డైలాగులు హ‌త్తుకుంటాయి. మొద‌టి వెర్ష‌న్ లో ట్రైన్ జ‌ర్నీలో ఇషా రెబ్బాతో ల‌వ్ లో ప‌డితే..రెండో వెర్ష‌న్ లో పూజిత‌తో ట‌చ్ లో ఉంటాడు.
సినిమానా కావాలా లేక ప్రేమ కావాలా..ఈ రెండింటిలో హీరో అశోక్ ఏది తేల్చుకుంటాడ‌నే దానిపై ఎక్క‌డా త‌ప్ప‌కుండా స‌స్పెన్ష్ క్రియేట్ చేస్తూ తీసిన సినిమా ఇది. అద్భుత‌మైన లొకేష‌న్లు..అక్క‌డ‌క్క‌డా త‌డిమి చూసుకునే చూపులు..ఒక‌రిపై మ‌రొక‌రు చేసుకునే సెటైర్లు..ప్రేమలో ప‌డాల‌ని అనుకునే వాళ్లు..ప్రేమించాల‌ని ప‌రిత‌పించే వాళ్లు..ప్రేమే జీవితం అనుకుంటూ వున్న వాళ్లు..ఇలా ప్ర‌తి ఒక్క‌రూ చూడాల్సిన ఫిలిం ..ద‌ర్శ‌కుడు…సినిమాను నిర్మించిన సుకుమార్ కు అదే స్థాయిలో త‌న టాలెంట్ కు ప‌దును పెట్టిన ద‌ర్శ‌కుడికి హ్యాట్సాఫ్. వీలైతే చూడండి…ఎక్క‌డా దొర‌క‌ని ఫీలింగ్ కు లోన‌వుతాం.

No comment allowed please