Palagummi Sainath : మఠం అవార్డు నాకొద్దు – సాయినాథ్
మురుగ మఠం మఠాధిపతి అరెస్ట్ వ్యవహారం
Palagummi Sainath : ప్రముఖ జర్నలిస్ట్ పాలగుమ్మి సాయినాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటకలోని చిత్ర దుర్గ మురగ మఠం మఠాధిపతి అత్యాచారం కేసులో అరెస్ట్ అయ్యారు.
కోర్టులో హాజరు పర్చడంతో కస్టడీకి తరలించారు. ఇదిలా ఉండగా గతంలో సాయినాథ్ జర్నలిస్ట్ గా చేసిన కృషికి గుర్తింపుగా మురుగ మఠం అవార్డును బహూకరించింది.
దీంతో తనకు అందజేసిన పురస్కారాన్ని తిరిగి ఇవ్వనున్నట్లు ప్రకటించారు పాలగుమ్మి సాయినాథ్. పిల్లలపై ఇలాంటి నేరాలను ఖండించేందుకు ఏ పదం బలంగా లేదని స్పష్టం చేశారు.
భారత దేశంలో చోటు చేసుకున్న పరిణామాలు, సమస్యలపై గత కొన్నేళ్లుగా రాస్తూ వస్తున్నారు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా గతంలో మురుగ మఠం అవార్డును బహూకరించింది.
ఇదిలా ఉండగా పాఠశాల బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు మురుగ మఠం మఠాధిపతి శివమూర్తి మురుగ శరణారావు అరెస్ట్ చేయడంపై సీరియస్ గా స్పందించారు.
రామన్ మెగసెస్ అవార్డు గ్రహీత కూడా. 2017లో మురుగ మఠం తనకు అందించిన బసవశ్రీ అవార్డును తిరిగి ఇస్తున్నట్లు ప్రకటించారు పాలగుమ్మి సాయినాథ్.
మఠాధిపతి శివమూర్తి మురుగ శరణారావును అరెస్ట్ చేశాక సాయినాథ్ వరుస ట్వీట్లతో విరుచుకు పడ్డారు. పాలగుమ్మి సాయినాథ్(Palagummi Sainath) చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి.
ఈ కేసులో ప్రాణాలతో బయట పడిన వారికి సంఘీభావంగా , ఈ కేసులో న్యాయం జరగాలనే ఉద్దేశంతో నాకు మఠం అందించిన బసవశ్రీ అవార్డుతో పాటు నాకు ఇచ్చిన రూ. 5 లక్షల మనీని చెక్కు ద్వారా తిరిగి ఇస్తున్నట్లు సాయినాథ్ వెల్లడించారు.
Also Read : మఠాధిపతి అరెస్ట్ పై సిద్దరామయ్య కామెంట్స్