Krishna Janmashtami : జన్మాష్టమి వేడుకలకు ‘మధుర’ ముస్తాబు
భారీ ఎత్తున భద్రత పెంచిన ప్రభుత్వం
Krishna Janmashtami : జన్మాష్టమి వేడుకలు శుక్రవారం దేశ వ్యాప్తంగా జరగనున్నాయి. ప్రధానంగా మధురలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. వేడుకల సందర్భంగా నగరాన్ని అత్యంత సుందరమయంగా తీర్చిదిద్దారు.
భారీ ఎత్తున భద్రతను పెంచారు. మొబైల్ ఫోన్లు, నగదు చోరీలు, చైన్ స్నాచింగ్ లు, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం వంటి సంఘటనలు ఎక్కువగా చోటు చేసుకోనున్నాయి.
గతంలో ఇవే ఎక్కువగా జరగడంతో పోలీసులు మరింత ఫోకస్ పెట్టారు. నిఘాను కఠినతరం చేశారు. ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు దర్శనం ఇస్తున్నాయి.
చీమ చిటుక్కుమన్నా , ఎవరు అనుమానాస్పదంగా కనిపించినా వెంటనే పట్టుకునేలా ఖాకీలు ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు.
ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ప్రధాన ఆలయాల్లో సాధారణ దుస్తుల్లో పోలీసు సిబ్బందిని నియమించారు.
బ్రిజ్ భూమి లోని ప్రధాన ఆలయాలు, ప్రత్యేకించి శ్రీకృష్ణ జన్మస్థానం(Krishna Janmashtami) లో ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు మధురను దర్శించుకుంటారు.
తమ మొక్కులు తీర్చుకుంటారు. దీంతో భద్రతను మరింతగా పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనుమానాస్పద వ్యక్తులు ప్రవేశించకుండా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధుర, బృందావనం ప్రతి ప్రవేశ ద్వారా వద్ద పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.
ఇదిలా ఉండగా శ్రీకృష్ణునికి సంబంధించిన ప్రదర్శనలను ప్రదర్శించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కళాకారుల ఊరేగింపును యూపీ మంత్రి లక్ష్మి నారాయణ్ చౌదరి ప్రారంభించారు.
ఈ కార్యక్రమాన్ని యుపి బ్రిజ్ తీర్థ వికాస్ పరిషత్, పర్యాటక శాఖ సంయుక్తంగా నిర్వహించాయి. ఇప్పటికే నగరం భక్తులతో , సందర్శకులతో పోటెత్తింది.
Also Read : జన్మాష్టమి పుణ్య మార్గానికి ప్రేరణ