Mayawati : అధిర్ రంజ‌న్ కామెంట్స్ దారుణం

నిప్పులు చెరిగిన మాయావ‌తి

Mayawati : కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజ‌న్ చౌద‌రి పై స‌ర్వ‌త్రా నిర‌స‌న వ్య‌క్తం అవుతోంది. భార‌త అత్యున్న‌త ప‌ద‌వి రాష్ట్ర‌ప‌తిగా కొలువు తీరిన ద్రౌప‌ది ముర్ముపై అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం దారుణ‌మని పేర్కొన్నారు బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ చీఫ్‌, మాజీ సీఎం కుమారి మాయావ‌తి(Mayawati) .

గురువారం ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆమె స్పందించారు. ఇది పూర్తిగా ప్ర‌జాస్వామ్యానికి మ‌చ్చ‌గా ఆమె అభివ‌ర్ణించారు. గిరిజ‌న, ఆదివాసీ స‌మాజం నుంచి మొట్ట మొద‌టిసారిగా రాష్ట్ర‌ప‌తి ప‌ద‌విని అధిష్టించింది.

దీనిని అగ్ర వ‌ర్ణాల వారు జీర్ణించు కోవ‌డం లేదంటూ నిప్పులు చెరిగారు మాయావ‌తి. ఆమెపై అధిర్ రంజ‌న్ చౌద‌రి అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం దారుణం. ప్ర‌జాస్వామ్యానికి ఇది మాయాని మ‌చ్చ లాంటిద‌ని పేర్కొన్నారు.

అత్యంత బాధాక‌రం. ప్ర‌తి ఒక్క‌రు ఖండించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు మాయావ‌తి. దీనిపై ఇప్ప‌టికే లోక్ స‌భ , రాజ్య స‌భ స్తంభించాయి.

భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన ఎంపీలు , కేంద్ర మంత్రులు తీవ్ర అభ్యంత‌రం తెలిపారు. అధిర్ రంజ‌న్ చౌద‌రి బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

దీంతో తాను ఆమె ప‌ట్ల ఇప్ప‌టికీ గౌర‌వ భావంతో ఉన్నాన‌ని, ఎలాంటి అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌లేద‌న్నారు అధిర్ రంజ‌న్ చౌద‌రి. కావాల‌నే బీజేపీ రాజ‌కీయం చేస్తోంద‌న్నారు.

ఒక‌వేళ ఆమె మ‌న‌సు నొప్పిస్తే తాను క్ష‌మాప‌ణ‌లు చెప్పేందుకు సిద్దంగా ఉన్నాన‌ని స్ప‌ష్టం చేశారు చౌద‌రి. సోనియా గాంధీ క్ష‌మాప‌ణ‌లు చెప్పాలంటూ కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామ‌న్ , స్మృతీ ఇరానీ ప‌ట్టు ప‌ట్టారు.

Also Read : నాకు మాట్లాడేందుకు ఛాన్స్ ఇవ్వండి

Leave A Reply

Your Email Id will not be published!